Sivangi : సినిమా స్క్రీన్ ప్లేతో రాబోతున్న కొత్త సీరియల్ సివంగి..
సినిమా స్క్రీన్ ప్లేతో రాబోతున్న సరికొత్త సీరియల్ 'సివంగి'. ఈ నెల 25 నుండి..

Telugu new serial Sivangi telecast in gemini tv from march 25th
Sivangi : ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సినిమాలోనే కాదు, సీరియల్స్ లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈక్రమంలోనే సినిమాల మాదిరి స్క్రీన్ ప్లే, లవ్ స్టోరీలతో టీవీ సీరియల్స్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న సరికొత్త సీరియల్ ‘సివంగి. ప్రముఖ తెలుగు టీవీ జెమిన్ ఛానల్ లో ఇది ప్రసారం కాబోతుంది.
ఒక పల్లెటూరిలోని పేద కుటుంబంలో పుట్టిన చిన్న కూతురు ఆనంది.. ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్ధికంగా సహాయపడుతూ, స్నేహితులతో సరదా జీవితాన్ని గడుతూ వస్తుంటుంది. అంతేకాదు ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా.. సొంతం మనిషిలా ఆ కష్టం సహాయంగా నిలుస్తుంటుంది. అయితే తన అక్క పెళ్లిలో ఏర్పడిన ఓ అనుకోని పరిస్థితి వల్ల.. ఒక పెద్ద బాధ్యతని తన బుజాల పై వేసుకోవాల్సి వస్తుంది.
Also read : Ram Charan : రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా.. రాబోయే సినిమా బహుమతులు ఇవే..
ఆ బాధ్యతని ఒక కొడుకులా ఆనంది తీసుకోని అది నెరవేర్చడం కోసం సిటీకి వెళ్తుంది. అలా సిటీకి వెళ్లిన ఆనంది అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది..? ఆమె మళ్ళీ తన ఊరుకి తిరుగు వచ్చిందా..? తన అక్క పెళ్లిని చేయగలిగిందా..? అనేవి సీరియల్ చూసి తెలుసుకోవాల్సిందే. మార్చ్ 25 నుండి ఈ సీరియల్ ప్రారంభం కాబోతుంది. ప్రతిరోజు రాత్రి 7:30 గం.లకు ఈ సీరియల్ ప్రసారం కానుంది.