MixUp Teaser : వామ్మో ఆహా నుంచి ఇంత బోల్డ్ కంటెంట్..? టీజర్‌లోనే ఇంతుందంటే..
వామ్మో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఓ రేంజ్ బోల్డ్ కంటెంట్ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Telugu OTT Aha Original MixUp movie Teaser released
MixUp Teaser : తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా.. కొత్త కొత్త కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సిరీస్ తో పాటు మూవీస్ ని కూడా నిర్మిస్తూ అలరిస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా బోల్డ్ కంటెంట్ తో ఓ సినిమాని తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘మిక్సప్’ అనే టైటిల్ తో ఓ బోల్డ్ కంటెంట్ మూవీని రూపొందించారు. నేడు ఆ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.
ఆదర్శ్, అక్షర గౌడ, కమల్, పూజ జె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆకాష్ బిక్కి డైరెక్ట్ చేస్తున్నారు. లవ్ అండ్ లస్ట్ నేపథ్యంతో హైమ వర్షిణి ఈ చిత్రానికి కథని అందించారు. రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే.. కథ అంతా పెళ్ళైన రెండు కొత్త జంటల మధ్య సాగుతుందని తెలుస్తుంది. ఒక జంటలోని భార్యకి, మరో జంటలోని భర్తకి సెక్స్ లైఫ్ పై ఎక్కువ ఆసక్తి ఉండడం, మిగిలిన ఇద్దరికి లవ్ మేకింగ్ పై ఆసక్తి ఉండడం టీజర్ లో చూపించారు.
Also read : Bhimaa : మొన్న హనుమాన్.. ఇప్పుడు భీమా.. రేపు కల్కి.. ఆ పాయింట్‌తో సినిమాలు..
ఈ నలుగురులో ఒకే రకమైన ఆసక్తితో ఉన్న మరో ఇద్దర్ని కలుసుకుంటే.. ఆ తరువాత కథ ఏంటనేదే మూవీ అని తెలుస్తుంది. కాగా టీజర్ చూస్తుంటే.. ఇది టాలీవుడ్ లస్ట్ స్టోరీ అనిపించింది. టీజర్ లోనే ఓ రేంజ్ బోల్డ్ కంటెంట్ ని చూపించేసిన మేకర్స్.. ఫుల్ మూవీలో ఎలాంటి బోల్డ్ సన్నివేశాలతో హీటెక్కించబోతున్నారో చూడాలి. మార్చి 15న ఈ సినిమాని ఆహాలో రిలీజ్ చేయనున్నారు.