CCL 2023 : క్రికెట్ అయినా సినిమా అయినా డామినేషన్ మనదే.. తెలుగు వారియర్స్ విక్టరీ!

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) ఫైనల్ మ్యాచ్ నిన్న (మార్చి 25) విశాఖపట్నంలో జరిగింది. ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ (Telugu Warriors), భోజపురి దబాంగ్స్ (Bhojpuri Dabanggs) పోరాడగా.. తెలుగు హీరోలు టైటిల్ ట్రోఫీ సాధించారు.

CCL 2023 : దాదాపు 3 ఏళ్ళ తరువాత సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) మళ్ళీ మొదలైంది. ఇక క్రికెట్‌ని, సినిమాని అమితంగా అభిమానించే మనం.. స్క్రీన్ పై ఫైట్‌లు చేసే హీరోలు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో బౌండరీలు కొడుతున్న సీన్ చూస్తుంటే వచ్చే మజానే వేరు. ఫిబ్రవరి 18న మొదలైన ఈ CCL మ్యాచ్స్ లో 8 టీమ్స్ పాల్గొన్నాయి. మొత్తం 16 మ్యాచ్‌లు జరగగా.. వాటిలో సెమీ ఫైనల్స్ వరకు భోజపురి దబాంగ్స్ (Bhojpuri Dabanggs), ముంబై హీరోస్ (Mumbai Heroes), తెలుగు వారియర్స్ (Telugu Warriors), కర్ణాటక బుల్ డోజర్స్ (Karnataka Bulldozers) చేరుకున్నాయి.

CCL 2023 : తెలుగు వారియర్స్‌ని ఫైనల్స్‌కి తీసుకు వెళ్లిన థమన్..

ఇక ఈ సెమీ ఫైనల్స్ లో భోజపురి అండ్ తెలుగు హీరోలు విజయం సాధించి ఫైనల్ కి చేరుకున్నారు. నిన్న (మార్చి 25) విశాఖపట్నంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ తెలుగు వారియర్స్ విజయం సాధించి CCL హిస్టరీలో ఎక్కువ టైటిల్స్ అందుకున్న టీంగా నిలిచింది. టాస్ గెలిచినా తెలుగు వారియర్స్ బౌలింగ్ ఎంచుకుని ఫైనల్ బరిలోకి దిగింది. దీంతో బ్యాటింగ్ కి దిగిన భోజపురి మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్స్ కోల్పోయి 72 పరుగులు చేసింది. అనంతరం తెలుగు వారియర్స్ బ్యాటింగ్ దిగి 4 వికెట్స్ నష్టానికి 104 పరుగులు చేసింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని (Akhil Akkineni) 67 పరుగులు చేశాడు.

CCL 2023 : టేబుల్ టాప్‌లో తెలుగు వారియర్స్, చివరిలో బాలీవుడ్.. అఖిల్ స్ట్రైక్ రేట్ ఎంత ఉందో తెలుసా?

రెండు ఇన్నింగ్స్ కి దిగిన భోజపురి 6 వికెట్ల నష్టానికి కేవలం 89 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తెలుగు వారియర్స్ ముందు జస్ట్ 58 పరుగులు మాత్రమే టార్గెట్ ఉంది. ఈ లక్ష్యాన్ని ఒక వికెట్ నష్టంతో చాలా తేలికగా ఛేదించేశారు. ఇక ఈ ఏడాది CCL టైటిల్ ని కూడా తెలుగు వారివర్సే కైవసం చేసుకుంది. CCC హిస్టరీలో ఇప్పటి వరకు.. కర్ణాటక – 2, చెన్నై – 2, ముంబై – 1, తెలుగు – 4 టైటిల్స్ ని (2015, 16, 17, 2023) అందుకున్నారు. చూస్తుంటే క్రికెట్ గ్రౌండ్ లో అయినా, సినిమా థియేటర్ లో అయినా మన తెలుగు హీరోలు డామినేషనే కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు