“దర్బార్” విజయం కోసం రజనీ అభిమానుల వింత దీక్ష

  • Published By: chvmurthy ,Published On : January 8, 2020 / 04:23 PM IST
“దర్బార్” విజయం కోసం రజనీ అభిమానుల వింత దీక్ష

Updated On : January 8, 2020 / 4:23 PM IST

తమ అభిమాన హీరో  సినిమా విజయం సాధించటానికి అభిమానులు చేసే పనులు ఒక్కోసారి ఒళ్లు గగ్గుర్పొడుస్తాయి. తమిళసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన దర్బార్‌ చిత్రం జనవరి 9 గురువారం నాడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మధురైలో  రజనీ  అభిమానులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. 
దర్బార్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన అభిమానులు మన్‌ సొరు దీక్షను చేపట్టారు. రజనీకాంత్‌ అభిమాని ఒకరు మాట్లాడుతూ..మేం 15 రోజులపాటు మన్‌ సొరు (ప్లేట్‌ లేకుండా ఆహారం తినడం)కార్యక్రమాన్ని చేపట్టాం. మేం చేపట్టిన దీక్ష ఫలితంగా దర్బార్‌ చిత్రం ఘనవిజయం సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు.