Thalapathy 67: బాబోయ్.. లోకేశ్ కనగరాజ్ స్పీడ్ మామూలుగా లేదుగా.. అప్పుడే థళపతి 67 టైటిల్ అనౌన్స్‌మెంట్..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించబోతున్నాడనే వార్త వచ్చినప్పటి నుండీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసిన కొద్దిరోజులకే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని తాజాగా లాంచ్ చేశారు. లోకేశ్-విజయ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మాస్టర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
Thalapathy 67: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించబోతున్నాడనే వార్త వచ్చినప్పటి నుండీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసిన కొద్దిరోజులకే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని తాజాగా లాంచ్ చేశారు. లోకేశ్-విజయ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మాస్టర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
Thalapathy 67: పూజా కార్యక్రమాలతో థళపతి 67ను మొదలుపెట్టిన విజయ్..!
దీంతో ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకముందే, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ‘థళపతి 67’ వర్కింగ్ టైటిల్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమా టైటిల్‌ను ఫిబ్రవరి 3న అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సినిమా ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో, అప్పుడే టైటిల్‌ను అనౌన్స్ చేస్తుండటంతో లోకేశ్ కనగరాజ్ స్పీడ్ చూసి అభిమానులు అవాక్కవుతున్నారు.
మరి విజయ్-లోకేశ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తోండగా, అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.