LEO : విదేశాల్లో ‘లియో’ సంచ‌ల‌నం.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీసు రికార్డు

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ (Vijay) న‌టిస్తున్న చిత్రం లియో (LEO). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేష‌న్‌లో వచ్చిన ‘మాస్టర్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిల‌వ‌డంతో లియోపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

LEO : విదేశాల్లో ‘లియో’ సంచ‌ల‌నం.. రిలీజ్‌కు ముందే బాక్సాఫీసు రికార్డు

LEO

Vijay-LEO : త‌మిళ స్టార్ హీరో విజ‌య్ (Vijay) న‌టిస్తున్న చిత్రం లియో (LEO). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేష‌న్‌లో వచ్చిన ‘మాస్టర్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిల‌వ‌డంతో లియోపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అక్టోబ‌ర్ 19న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

Dinesh Karthik : జ‌వాన్ సినిమాపై దినేశ్ కార్తీక్‌.. 5 సంవ‌త్స‌రాలు.. ఎన్నో డిస్క‌ష‌న్లు, మ‌రెన్నో..

ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌లకు ఇంకా 40 రోజుల‌కు పైగా స‌మ‌యం ఉండ‌గానే ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్‌ను యూకేలో ఓపెన్ చేశారు. కేవ‌లం 24 గంట‌ల్లోనే 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. “విడుదలకు 6 వారాల ముందు UK బుకింగ్‌లను తెరిచి, కేవలం 24 గంటల్లో 10k+ టికెట్లు విక్రయించి రికార్డులను బద్దలు కొట్టిన తొలి భారతీయ చిత్రం లియో. అని ట్వీట్ చేసింది. నన్బా, కొండాది కొలుతా రెడీ ఉండండి. మేము ఇతర దేశాల్లో అతి త్వరలో టికెట్ల బుకింగ్ తెరవబోతున్నాం.” అని తెలిపింది.

Rakul Preet Singh : ఖరీదైన కారుని కొనుగోలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. వామ్మో ఏకంగా అన్ని కోట్లా..

ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న త్రిష న‌టిస్తోంది. అర్జున్‌, సంజ‌య్ ద‌త్‌, గౌత‌మ్ వాసుదేవ్ మేన‌న్‌, మిస్కిన్, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ సినిమా ద్వారానే సితార సంస్థ పంపిణీ రంగంలోకి అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే.