Thaman Revealed Anushka Shetty Doing Bhaagamathie Movie Sequel
Anushka Shetty : లవ్ స్టోరీలు, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు, యాక్షన్ సినిమాలు.. ఇలా అన్ని రకాల సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. కానీ బాహుబలి సినిమా తర్వాత అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది. గత సంవత్సరం అనుష్క తెలుగులో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మెప్పించింది. ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. దాంతో పాటు తెలుగులో కూడా ఒక సినిమా చేస్తుందని తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రివీల్ చేసాడు.
అరుంధతి తర్వాత అనుష్కకి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో అంతటి పేరొచ్చింది భాగమతి సినిమాకే. 2018లో అనుష్క భాగమతి అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చి మెప్పించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు చివర్లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి వదిలేసారు. అయితే ఇప్పుడు భాగమతి సీక్వెల్ కి వర్క్ జరుగుతుందని, దానికి నేను పని చేస్తున్నాను అని తమన్ తెలిపాడు. తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో తమన్ భాగమతి 2 గురించి లీక్ చేసాడు.
Also Read : Anushka – Thaman : ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న అనుష్క.. ప్రతి సంవత్సరం తమన్‌కి ఆ గిఫ్ట్..
అనుష్క ఫ్యాన్స్ త్వరగా భాగమతి 2 రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మలయాళంలో సినిమా అయ్యాక అనుష్క భాగమతి 2 చేసే అవకాశం ఉంది. దీంతో మరోసారి అనుష్క తన నట విశ్వరూపం చూపించబోతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.