Tharun Bhascker : కీడా కోలా సినిమాలో అల్లు అరవింద్‌ని నటించమని అడిగితే..

దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మూడో సినిమా ‘కీడా కోలా’(Keeda Cola)తో రాబోతున్నాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది.

Tharun Bhascker : కీడా కోలా సినిమాలో అల్లు అరవింద్‌ని నటించమని అడిగితే..

Tharun Bhasckar asks Allu Aravind for acting a role in Keeda cola Movie

Updated On : October 25, 2023 / 8:41 AM IST

Tharun Bhascker : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ ని అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మూడో సినిమా ‘కీడా కోలా’(Keeda Cola)తో రాబోతున్నాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇక ఈ కీడాకోలా సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రానాతో చిత్రయూనిట్ చేసిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు తరుణ్.

Also Read : Anasuya : ఈ వయసులో నీకెందుకు ఆంటీ అన్నవాళ్లకు.. అనసూయ దసరా మోటివేషనల్ పోస్ట్..

తరుణ్ భాస్కర్ సినిమా షూట్ మొదలయ్యే ముందు ఈ సినిమాలో బ్రహ్మానందం గారు చేసిన పాత్రకి మొదట అల్లు అరవింద్ గారిని అనుకున్నామని, ఆయన గతంలో పలు సినిమాల్లో కమెడియన్ గా మెప్పించారని, అందుకే అల్లు అరవింద్ గారిని తీసుకుందామని ఫిక్స్ అయినట్టు చెప్పాడు. వెళ్లి అల్లు అరవింద్ గారిని తమ సినిమాలో అడిగితే సింపుల్ గా నవ్వేసి నో చెప్పారట. ఆ తర్వాతే ఆ పాత్రకు బ్రహ్మానందంను తీసుకున్నారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. పలువురు నిజంగా అల్లు అరవింద్ ఒప్పుకొని ఉంటే ఉంటే కొత్తగా ఉండేదేమో, ఆయన కూడా రీ ఎంట్రీ ఇచ్చినట్టు ఉండేదని, కానీ బ్రహ్మిని మించి కామెడీ ఎవరు చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు.