Tharun Bhascker Announces His First Pan India Movie
Tharun Bhascker: టాలీవుడ్‌లో తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాల తరువాత ఈ డైరెక్టర్ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ, నటించాడు కూడా. అయితే తరుణ్ భాస్కర్ నుండి మళ్లీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
గతంలో తరుణ్ భాస్కర్ ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ ఆ సినిమా ఊసే లేకుండా పోయింది. కాగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. ‘కీడా కోలా’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించబోతున్నట్లు తరుణ్ భాస్కర్ తెలిపారు. అంతేగాక, ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఆగస్టు 23న నిర్వహిస్తున్నట్లు తరుణ్ భాస్కర్ ప్రకటించారు.
Tharun Bhaskar : ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ మూడో సినిమా.. సరికొత్త పేరుతో..
ఈ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్లు ఎవరనే విషయాలను మాత్రం తరుణ్ భాస్కర్ ఇప్పటికైతే వెల్లడించలేదు. దీంతో ఆగస్టు 23న పూజా కార్యక్రమం సందర్భంగా ఈ విషయాలను రివీల్ చేస్తుండొచ్చని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.