Tharun Bhaskar : ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ మూడో సినిమా.. సరికొత్త పేరుతో..

 ‘పెళ్ళిచూపులు’ సినిమాతో దర్శకుడిగా తరుణ్‌భాస్కర్‌ మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అంటూ మరో హిట్ కొట్టాడు. వరుసగా యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తూ.............

Tharun Bhaskar : ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ మూడో సినిమా.. సరికొత్త పేరుతో..

Keeda Kola

Tharun Bhaskar :  ‘పెళ్ళిచూపులు’ సినిమాతో దర్శకుడిగా తరుణ్‌భాస్కర్‌ మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అంటూ మరో హిట్ కొట్టాడు. వరుసగా యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తూ రెండు హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత తన మూడో సినిమాకి మాత్రం చాలా చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో రచయితగా, హీరోగా, యాంకర్ గా, యాక్టర్ గా, ఎడిటర్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు తరుణ్.

కానీ యూత్ లో తరుణ్ భాస్కర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో తరుణ్ దర్శకుడిగా నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. చాలామంది ఈ నగరానికి ఏమైంది 2 తీస్తే బాగుంటుందని కూడా అనుకున్నారు. మొత్తానికి తరుణ్ భాస్కర్ తన మూడో సినిమాని ప్రకటించాడు. గురువారం రాత్రి తన మూడో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు.

తెలుగు-తమిళ్‌లో బైలింగ్వల్ సినిమాలు చేస్తున్న హీరోలు

తరుణ్ భాస్కర్ మూడో సినిమాగా ‘కీడా కోలా’ అనే టైటిల్ తో రానున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారన్నది ఇంకా ప్రకటించలేదు. టైటిల్ పోస్టర్ లో ఓ కూల్ డ్రింక్ బాటిల్ మూత, కూల్ డ్రింక్, ఓ బొద్దింక ఉండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో తరుణ్ భాస్కర్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.