Site icon 10TV Telugu

బన్నీ త్రివిక్రమ్ సినిమాలోకి ఆ స్టార్ హీరోయిన్..?

Allu Arjun-Trivikram Movie Update

Allu Arjun-Trivikram Movie Update

హిట్‌ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ కాబోతోంది. అల్లుఅర్జున్‌తో మూవీకి ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. మరో 6 నెలల్లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అయితే బన్నీ పక్కన నటించేందుకు కరెక్ట్‌గా సూట్‌ అయ్యే హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నాడట త్రివిక్రమ్.

అల్లుఅర్జున్‌ సరసన హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై డిస్కస్ చేస్తున్నారట. బన్నీ చేసేది మైతలాజికల్ సినిమా అవ్వటంతో అందులో హీరోయిన్‌గా సాయిపల్లవి అయితే బాగుంటుందని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట.

Dilruba : ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ.. సారీలు, థ్యాంక్స్ లు చెప్పొద్దు..

అయితే స్టోరీ లైన్‌ విని..ఓకే అనుకుంటేనే సాయిపల్లవి నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. క్యారెక్టర్‌కు స్కోప్‌ ఉండి..ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ సీన్స్‌ లేకపోతేనే ఆమె నటిస్తారు. అయితే బన్నీ అంటే డాన్స్.. సాయిపల్లవి కూడా డాన్స్ ఇరగదీస్తుంది. ఇద్దరిని స్క్రీన్ మీద కనిపిస్తే బొమ్మ అదిరిపోద్దని అనుకుంటున్నారట త్రివిక్రమ్.

Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ‘హరి హర వీరమల్లు’ వాయిదా.. కొత్త విడుద‌ల తేదీని వెల్ల‌డించిన నిర్మాణ సంస్థ‌

కానీ సాయిపల్లవిని ఒప్పించటం అంటే అంత ఈజీ కాదు. మరి త్రివిక్రమ్ సాయిపల్లవిని ఒప్పిస్తారా లేదా చూడాలి. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో ఏ మూవీ చేయడం లేదు. బాలీవుడ్‌లో మాత్రం రామాయణ్ సినిమా చేస్తుంది. త్రివిక్రమ్‌ చెప్పే స్టోరీ లైన్‌ నచ్చితే.. సాయిపల్లవి నెక్స్ట్‌ ప్రాజెక్టు బన్నీతో చేయనుంది.

Exit mobile version