Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ‘హరి హర వీరమల్లు’ వాయిదా.. కొత్త విడుద‌ల తేదీని వెల్ల‌డించిన నిర్మాణ సంస్థ‌

ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ‘హరి హర వీరమల్లు’ వాయిదా.. కొత్త విడుద‌ల తేదీని వెల్ల‌డించిన నిర్మాణ సంస్థ‌

Pawan Kalyan Hari Hara Veera Mallu release postpone new date fix

Updated On : March 14, 2025 / 9:09 AM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న మూవీల్లో హ‌రి హ‌ర‌ వీర‌మ‌ల్లు ఒక‌టి. పీరియాడిక‌ల్ యాక్షన్‌ అడ్వెంచర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం మార్చి 28న విడుద‌ల కావాల్సిన ఉంది. అయితే.. తాజాగా ఈ చిత్ర విడుద‌లను వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను సైతం ప్ర‌క‌టించింది నిర్మాణ సంస్థ.

క్రిష్‌, జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. తొలి భాగానికి చిత్రీక‌ర‌ణ దాదాపుగా తుది ద‌శ‌కు చేరుకుంది. ప‌వ‌న్ డేట్స్ ఇస్తే మ‌రో నాలుగు రోజుల షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అసెంబ్లీ స‌మావేశాల త‌రువాత ప‌వ‌న్ ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చే అవ‌కాశం ఉంది. దీంతో ఈ సినిమా వాయిదా ప‌డుతుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి.

Aamir Khan : మ‌రోసారి ప్రేమ‌లో ప‌డిన ఆమిర్ ఖాన్‌.. 60వ ఏళ్ల వ‌య‌సులో..

తాజాగా ఆ వార్త‌లే నిజం అయ్యాయి. మూవీ విడుద‌ల వాయిదా ప‌డింది. అయితే.. ఎందుకు ఈ చిత్రాన్ని వాయిదా వేశారు అనే కార‌ణాన్ని చిత్ర బృందం వెల్ల‌డించ‌లేదు.

ఇదిలా ఉంటే.. మే 9న తొలి భాగం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఓ కొత్త పోస్ట‌ర్ పంచుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నిధి అగ‌ర్వాల్‌లు ఇద్ద‌రూ గుర్ర‌పు స్వారీ చేస్తున్న‌ట్లుగా పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో హోలీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది చిత్ర‌బృందం.

Pelli Kani Prasad : స‌ప్త‌గిరి ‘పెళ్ళికాని ప్ర‌సాద్’ ట్రైల‌ర్‌.. న‌వ్వులే న‌వ్వులు..

నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీలో బాబీ దేవోల్, నర్గీస్‌ ఫక్రీ, నోరా ఫతేహిలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.