Super Star Krishna : కృష్ణ తుదిశ్వాస ప్రశాంతంగా విడిచేందుకు చికిత్స నిలిపివేత.. కుటుంబసభ్యుల నిర్ణయం!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ.. నేడు హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో కన్ను మూసారు. తాజాగా కృష్ణ గారి మరణానికి గల కారణాలను వెల్లడించారు వైద్యులు. కృష్ణ తుదిశ్వాస ప్రశాంతంగా విడిచేందుకు చికిత్స నిలిపివేయడానికి కుటుంబసభ్యులతో చర్చించి...

The decision of the family members to stop the treatment so that Krishna can take his last breath peacefully
Super Star Krishna : టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ.. నేడు హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో కన్ను మూసారు. ఆదివారం అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో హాస్పిటల్ కి తరలించించారు కుటుంబసభ్యులు. ఎనిమిది మంది వైద్య బృందంతో నిన్నటి నుంచి చికిత్స అందించినప్పటికీ, ఈరోజు ఉదయం అయన ఈ లోకాని విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు.
Super Star Krishna : దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు.. సూపర్‌స్టార్ కృష్ణ లైఫ్ స్టోరీ..
తాజాగా కృష్ణ గారి మరణానికి గల కారణాలను వెల్లడించారు వైద్యులు. “సిటీస్కాన్‌లో బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించారు. బ్రెయిన్ డ్యామేజ్‌తో ముల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినడం వలన ఎన్ని ప్రయత్నాలు చేసిన కృష్ణ గారి శరీరం సహకరించక పోవడంతో.. ఇంటర్నేషనల్ వైద్యం ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. దీంతో అయన తుదిశ్వాస ప్రశాంతంగా విడిచేందుకు చికిత్స నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నాం.
కుటుంబసభ్యులతో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చాము. కృత్రిమ శ్వాసని మాత్రమే అందించి మిగతా చికిత్స మొత్తం నిలిపివేశాం. అవయవాలు పనిచేయకపోవడంతో తెల్లవారుజామున గం.4:09 నిమిషాలకు తుది శ్వాస విడిచారు” అని తెలియజేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు కృష్ణ గారి అకాలమరణానికి చింతిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.