Lucifer Remake: మెగాస్టార్ కోసం టైటిల్ త్యాగం చేసిన దర్శకుడు!

మెగాస్టార్ ఆ మధ్య కాస్త నెమ్మదించినా ఈసారి వరస సినిమాలతో ముందుకు రావాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే వరస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరు ఆ తర్వాత మరో రెండు రీమేక్ కథలను సిద్ధం చేసుకున్నాడు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన లూసిఫ‌ర్ రీమేక్‌తో పాటు వేదాళం రీమేక్‌లో మెగాస్టార్ న‌టించ‌బోతున్నాడు. ప్రస్తుతం ఆచార్య చివరి దశకు రావడంతో తర్వాత లూసిఫర్ రీమేక్ పనులు మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది.

Lucifer Remake: మెగాస్టార్ కోసం టైటిల్ త్యాగం చేసిన దర్శకుడు!

Lucifer Remake

Updated On : August 6, 2021 / 10:02 PM IST

Lucifer Remake: మెగాస్టార్ ఆ మధ్య కాస్త నెమ్మదించినా ఈసారి వరస సినిమాలతో ముందుకు రావాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే వరస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరు ఆ తర్వాత మరో రెండు రీమేక్ కథలను సిద్ధం చేసుకున్నాడు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన లూసిఫ‌ర్ రీమేక్‌తో పాటు వేదాళం రీమేక్‌లో మెగాస్టార్ న‌టించ‌బోతున్నాడు. ప్రస్తుతం ఆచార్య చివరి దశకు రావడంతో తర్వాత లూసిఫర్ రీమేక్ పనులు మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ లో తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేయడంతో ఒరిజినల్ కథకు మెగాస్టార్ రేంజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జత చేసి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ 153వ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక కార్యక్రమం జరుగుతుండగా.. ఇందులో భారీ ప్రాధాన్యత గల హీరో చెల్లి పాత్ర కోసం అక్కినేని అమల పేరు కూడా వినిపిస్తుంది. ఇక మరోవైపు ఈ క్రేజీ రీమేక్ కోసం టైటిల్ ఎంపికపై కూడా చాలా రోజులుగా రకరకాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇందులో ప్రధానంగా కింగ్ మేకర్, గాడ్ ఫాదర్ అనే టైటిల్స్ వినిపించాయి. రెండిటిలో ఏది బెటర్ అనే విషయంలో సభ్యులందరూ ఆలోచించి ఫైనల్ గా గాడ్ ఫాదర్ కి ఓటు వేసినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ టైటిల్ ఇప్పటికే దర్శకుడు సంపత్ నంది రిజిస్టర్ చేసుకున్నాడు. సంపత్ నందికి మెగా కాంపౌండ్ తో మంచి సంబంధాలే ఉండగా చరణ్ తో రచ్చ సినిమా తెరకెక్కించాడు. ఆ చొరవతోనే గాడ్ ఫాదర్ టైటిల్ కోసం సంపత్ తో చర్చలు జరపగా సంతోషం మెగాస్టార్ కోసం టైటిల్ వదులుకున్నట్లు వినిపిస్తుంది. అయితే అధికారిక ప్రకటన వస్తే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.