MAA Elections: అభ్యర్థుల తుది జాబితా రె’ఢీ’.. ఇక సమరమే!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA Elections) ఎన్నికల తేదీ దగ్గర పడుతోన్న కొద్దీ హోరాహోరీగా మారుతుంది. ఇప్పటికే బరిలో దిగుతున్న అభ్యర్థులు తమ​ నామినేషన్లను దాఖలు చేయగా శుక్రవారం..

MAA Elections: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA Elections) ఎన్నికల తేదీ దగ్గర పడుతోన్న కొద్దీ హోరాహోరీగా మారుతుంది. ఇప్పటికే బరిలో దిగుతున్న అభ్యర్థులు తమ​ నామినేషన్లను దాఖలు చేయగా శుక్రవారం నటుడు బండ్ల గణేశ్, శనివారం సీవీఎల్‌ నరసింహారావులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసిన ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

Maa Elections: ప్రకాష్ VS విష్ణు.. మధ్యలో పవన్.. కాకరేపుతున్న ఎలక్షన్!

ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్యనే ప్రధాన పోటీ ఖరారైంది. మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీలో ఉండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవికి బెనర్జీ, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీలో ఉండగా.. జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు బరిలో ఉన్నారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా.. రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణిలు పోటీలో ఉన్నారు.

MAA Elections : ‘మా’ ఎన్నికల కోసం జోరుగా నైట్‌ పార్టీలు

ఇక అక్టోబర్ 10వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. గత నాలుగైదు నెలలుగా మా ఎన్నికలపై హడావుడి మొదలవగా.. కొద్దిరోజులుగా ఎవరికి వారు రెండు ప్యానల్స్ ఓట్ల వేటలో పడిపోయారు. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఓట్లను అభ్యర్ధిస్తున్న ఈ రెండు ప్యానల్స్ అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా తన బలాన్ని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో కూడా బడా బడా పెద్దలంతా ఈ రెండు వర్గాలకు ప్రధాన బలంగా వెనకుండి నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు