The Godfather : మాస్టర్ పీస్ మళ్ళీ వస్తోంది..

ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిలిం ‘ది గాడ్ ఫాదర్’ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రీ-రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్..

The Godfather : మాస్టర్ పీస్ మళ్ళీ వస్తోంది..

The Godfather

Updated On : January 16, 2022 / 2:09 PM IST

The Godfather: హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో.. ఆ మాటకొస్తే, ప్రపంచ సినిమా చరిత్రలో ‘ది గాడ్ ఫాదర్’ మూవీది ఓ ప్రత్యేకమైన్ స్థానం.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిలిం అది.. 1972 లో యావత్ ప్రపంచం సర్ ప్రైజ్ తో కూడిన షాక్ కి గురయ్యేలా చేసిన సినిమా.. 1972లో రిలీజ్ అయిన ఈ గ్రేటెస్ట్ మూవీ 2022తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

The Godfather 50th Anniversary

ఈ సందర్భంగా సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ‘ది గాడ్ ఫాదర్’ సిరీస్ లో మొత్తం మూడు సినిమాలొచ్చాయి. ‘ది గాడ్ ఫాదర్’, 50 సంవత్సారలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రీ-రిలీజ్ చెయ్యబోతున్నారు.

The Godfather 50th Anniversary

రీసెంట్‌గా ‘ది గాడ్ ఫాదర్’ 50th యానివర్సరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా దర్శకత్వ ప్రతిభ, మారియో పుజో రచన, మార్లోన్ బ్రాండో నటన సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెట్టాయి. మొత్తం 10 కేటగిరీల్లో నామినేట్ అయిన ‘ది గాడ్ ఫాదర్’.. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ పొందింది. ఫిబ్రవరి 25న పారామౌంట్ పిక్చర్స్ వారు డాల్బీ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని ప్రపంచ సినీ ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఫస్ట్ టైమ్ అదిరిపోయే 4K లో రీమాస్టర్డ్ చేస్తున్నారు. అలాగే 4K అల్ట్రా UHD అండ్ డిజిటల్ వెర్షన్ మార్చి 22న రిలీజ్ చెయ్యబోతున్నారు.