Abhishek Agarwal: గ్రామాన్ని దత్తత తీసుకున్న కార్తికేయ-2 నిర్మాత..

"ది కాశ్మీర్ ఫైల్స్", "కార్తికేయ-2" వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ "అభిషేక్ అగర్వాల్". వెండితెరపై మంచి చిత్రాలను నిర్మించడమే కాదు నిజ జీవితంలో కూడా మంచి పనులకు శ్రీకారం చుట్టి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాడు. తెలంగాణలోని ఒక గ్రామాన్ని...

Abhishek Agarwal: “ది కాశ్మీర్ ఫైల్స్”, “కార్తికేయ-2” వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ “అభిషేక్ అగర్వాల్”. నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టడమే కాదు, మంచి చిత్రాలను తెరకెక్కించడమని నమ్మే నిర్మాత అభిషేక్. తీసింది నాలుగు సినిమాలే అయినా.. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

Karthikeya 3: ‘కార్తికేయ-3’పై సాలిడ్ టాక్.. అందులోనూ చూడొచ్చు!

వెండితెరపై మంచి చిత్రాలను నిర్మించడమే కాదు నిజ జీవితంలో కూడా మంచి పనులకు శ్రీకారం చుట్టి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాడు. అభిషేక్ అగర్వాల్ తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్.. టెక్స్‌టైల్ మరియు పెరల్ వ్యాపారాలు చేసే ప్రముఖ పారిశ్రామికవేత. ఈనెల 30న తన తండ్రి పుట్టిన రోజు కావడంతో.. తెలంగాణలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

అయితే ఆ గ్రామం బిజెపి క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి స్వగ్రామం అయిన కందుకూరు మండలంలోని తిమ్మాపూర్ అనే ఊరు. అభిషేక్ అగర్వాల్ కు షన్ రెడ్డితో మంచి సంబంధం ఉండడంతో ఆ ఊరిని దత్తత తీసుకున్నట్లు తెలుస్తుంది. పుట్టినరోజు వేడుకలకు కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నిర్మాత రవితేజతో ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ధమాకా’ సినిమాలను నిర్మిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు