Karthikeya 3: ‘కార్తికేయ-3’పై సాలిడ్ టాక్.. అందులోనూ చూడొచ్చు!

యంగ్ హీరో నిఖిల్ నటించిన రీసెంట్ మూవీ ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ సీక్వెల్ మూవీపై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా కార్తికేయ-2 చిత్రాన్ని మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Karthikeya 3: ‘కార్తికేయ-3’పై సాలిడ్ టాక్.. అందులోనూ చూడొచ్చు!

Solid News Goes Viral About Karthikeya 3

Karthikeya 3: యంగ్ హీరో నిఖిల్ నటించిన రీసెంట్ మూవీ ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ సీక్వెల్ మూవీపై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా అందరూ అనుకున్నట్లుగానే సాలిడ్ కంటెంట్‌తో రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షంతో దూకుడును ప్రదర్శించింది. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ మరోసారి అతడి కెరీర్‌లో టాప్‌గా నిలిచింది.

Karthikeya 3: కార్తికేయ-2.. సర్‌ప్రైజ్ గ్యారెంటీ అంటోన్న చందూ మొండేటి!

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయగా, అన్ని భాషల్లోనూ దుమ్ములేపింది ఈ మూవీ. తాజాగా కార్తికేయ-2 చిత్రాన్ని మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దర్శకుడు చందూ మొండేటి ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిఖిల్, కార్తికేయ-3 మూవీపై ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు.

Karthikeya2: తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా కార్తికేయ-2.. అసలు విషయమేంటంటే?

కార్తికేయ-3 చిత్రాన్ని మరింత భారీ బడ్జెట్‌తో, భారీ క్యాస్టింగ్‌తో పాన్ వరల్డ్ మూవీగా తీయబోతున్నామని.. ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తామని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఈ వార్తతో కార్తికేయ-3 సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి కార్తికేయ-3 సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో, ఎప్పుడు చిత్రీకరణ జరుపుతారో, ఎప్పటికి రిలీజ్ చేస్తారో చూడాలి.