Squid Game: స్క్విడ్ గేమ్ రెండో సీజన్.. ఈసారి ఎలాంటి గేమ్ ఉంటుందో?
కరోనా లాక్ డౌన్ లో బాగా వినిపించిన వెబ్ సిరీస్ పేరు స్క్విడ్ గేమ్. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా స్క్విడ్ గేమ్ పేరు మార్మ్రోగిపోయింది. దక్షణ కొరియా దర్శకుడు..

Squid Game
Squid Game: కరోనా లాక్ డౌన్ లో బాగా వినిపించిన వెబ్ సిరీస్ పేరు స్క్విడ్ గేమ్. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా స్క్విడ్ గేమ్ పేరు మార్మ్రోగిపోయింది. దక్షణ కొరియా దర్శకుడు తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రపంచాన్ని దున్నేసింది. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది.
Good Luck Sakhi: కరోనా కాలం.. అయినా ఈనెలలోనే థియేటర్లలో ‘గుడ్‌లక్ సఖి’!
పదేళ్లుగా ఎందరో రిజెక్ట్ చేసిన ఆ కథ నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీకి సరికొత్త రికార్డులు తెచ్చిపెట్టింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూసిన ఈ వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ కోసమే నెట్‌ఫ్లిక్స్‌కు సబ్‌స్క్రైబ్ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువే. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్‌లో 9 ఎపిసోడ్‌లు ఉంటాయి.
Lakaram Tank Bund: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం.. ఆవిష్కరణకు జూనియర్?
సమాజంలో భావోద్వేగాలు, అసమానలతను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూనే.. అంతకు మించిన ఉత్కంఠ.. సమాజంలో మధ్యతరగతి మనుషులు అనుభవించే కష్టాలు లాంటి యూనివర్సల్ సమస్యలతో తెరకెక్కిన ఈ దక్షణ కొరియా వెబ్ సిరీస్ ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ స్క్విడ్ గేమ్ సిరీస్‌కు రెండో సీజన్ రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కో సీఈవో, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ సారండోస్ తెలిపారు.
Ravi Teja Mother: రవితేజ తల్లిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే?
నెట్‌ఫ్లిక్స్ 2021 నాల్గో త్రైమాసిక ఆదాయం గురించి మీడియాతో మాట్లాడిన సారండోస్.. స్క్విడ్ గేమ్‌కు రెండో సీజన్ రానుందా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడు. ‘కచ్చితంగా. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించిన నెంబర్ 1 సిరీస్. స్క్విడ్ గేమ్ ప్రపంచం ఇప్పుడే ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్ అభివృద్ధికి దోహదపడే ఫ్రాంచైజీలో మొదటి స్థానంలో ఉందని చెప్పాడు. స్క్విడ్ గేమ్ డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ కూడా గతంలో రెండో సీజన్ ఉంటుందని చెప్పాడు. మరి ఈసారి ఎలాంటి గేమ్ తో ఈ సిరీస్ వస్తుందో చూడాల్సి ఉంది.