Good Luck Sakhi: కరోనా కాలం.. అయినా ఈనెలలోనే థియేటర్లలో ‘గుడ్‌లక్ సఖి’!

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న కీర్తి సురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయింది. స్టార్ హీరోలతో ఆడిపాడుతూనే..

Good Luck Sakhi: కరోనా కాలం.. అయినా ఈనెలలోనే థియేటర్లలో ‘గుడ్‌లక్ సఖి’!

Good Luck Sakhi

Good Luck Sakhi: మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న కీర్తి సురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయింది. స్టార్ హీరోలతో ఆడిపాడుతూనే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో వస్తుంది. కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పెంగ్విన్, మిస్ ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్రంగా నిరాశ‌ప‌రిచగా గుడ్ లక్ సఖి విడుదలకి సిద్ధంగా ఉంది.

RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

ఇప్పటికే ఎన్నో రిలీజ్ డేట్స్ ఇచ్చిన ఈ సినిమా ప్రతిసారి కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడులో కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉన్నా, థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు వెనకాడుతున్నా.. గుడ్ ల‌క్ స‌ఖి చిత్రాన్ని జనవరి 28న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌బోతున్నట్లు యూనిట్ తాజాగా ప్రకటించింది.

Allu Arjun: బన్నీ గ్రాఫ్ మార్చేసిన పుష్ప.. క్రేజ్ మామూలుగా లేదు!

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను విడుదల కానున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి నిర్మించగా.. కీర్తి సురేష్ తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించడం విశేషం.