Allu Arjun: బన్నీ గ్రాఫ్ మార్చేసిన పుష్ప.. క్రేజ్ మామూలుగా లేదు!

ఒక్క సినిమా హీరో గ్రాఫ్ ని మార్చేస్తుంది. పుష్ప కూడా అలానే అల్లు అర్జున్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్లి కూర్చో బెట్టింది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాలో.. ఆ స్థాయి, క్రేజ్..

Allu Arjun: బన్నీ గ్రాఫ్ మార్చేసిన పుష్ప.. క్రేజ్ మామూలుగా లేదు!

Pushpa

Allu Arjun: ఒక్క సినిమా హీరో గ్రాఫ్ ని మార్చేస్తుంది. పుష్ప కూడా అలానే అల్లు అర్జున్ ని ఒక లెవెల్ కి తీసుకెళ్లి కూర్చో బెట్టింది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాలో.. ఆ స్థాయి, క్రేజ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కే వస్తుంది అనుకుంటే.. సడెన్ గా అల్లు అర్జున్ ఎంటరై మొత్తం సీన్ మార్చేశాడు. ఆర్ఆర్ఆర్ వాయిదా మీద వాయిదా పడుతుంటే పుష్పరాజ్ సడెన్ ఎంట్రీ పాన్ ఇండియా లెక్కలు మార్చేసింది.

Star Hero’s Shooting: బాకీపడిన షూటింగ్స్.. టెన్షన్‌లో స్టార్ హీరోలు!

రాజమౌళి బాహుబలి రెండు పార్టుల దెబ్బకు ఇండయన్ సినిమాకే సూపర్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. బాహుబలి సిరీస్ ప్రభాస్ రేంజ్ ని ఊహించనంత రేంజ్ కి తీసుకెళ్లింది. మళ్లీ అదే రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ కి దూసుకు పోతారని అందరూ అనుకున్నారు. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ట్రిపుల్ఆర్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు చరణ్, తారక్. ప్రభాస్ పక్కన తొడ కొట్టి నుంచుందాం అనుకున్నారు. అయితే వరస వాయిదాలు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ వాయిదాల కంటే అల్లు అర్జున్ త్రిబుల్ ఆర్ టీమ్ మీద పెద్ద దెబ్బ కొట్టాడు.

Jai Bhim: జై భీమ్ మరో ఘనత.. ఆస్కార్ బరిలో తమిళ, మలయాళ సినిమాలు!

ఏ ముహూర్తాన తగ్గేదేలే అన్నాడో గాని, బన్నీ క్రేజ్ నిజంగానే ఎక్కడా తగ్గట్లేదు. కోవిడ్ వేవ్ కు ముందు విడుదలైన పుష్ప బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించడమే కాకుండా అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ ని ఆల్ టైమ్ హై కి చేర్చేసింది. బన్నీ బ్రాండ్ ఇప్పుడు ప్రభాస్ పక్కన నుంచుని మీసం మెలేస్తోంది.

NTR Special Song: అంతయు నీవే తారకరామా.. ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు!

పుష్ప తర్వాత బన్నీ పాత సినిమాలన్నింటిని దుమ్ము దులిపి, వేరే భాషల్లో డబ్ చేస్తున్నారు. పుష్పతో బన్నీకి వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ను చూస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్ పల్లు పటపటా కొరుకుతున్నారు. పోలీసుల కాంపైన్ లు , అమూల్ యాడ్లు చివరకీ కరోనా జాగ్రత్తల్లో కూడా ఇప్పుడు బన్నీనే బ్రాండ్ అంబాసిడర్.. మొత్తంగా పుష్పరాజ్ బన్నీ రేంజ్ అమాంతం పెంచేశాడు.