Thika Maka Thanda : తికమక తాండ మూవీ రివ్యూ.. రాజన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ యాని హీరోయిన్ గా మెప్పించిందా?
ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా, యాని, రేఖా నిరోషా హీరోయిన్స్ గా నూతన దర్శకుడు వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తికమక తాండ. ఈ సినిమా నేడు డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Thika Maka Thanda New Movie Review and Rating
Thika Maka Thanda Review : TSR మూవీమేకర్స్ నిర్మాణంలో తిరుపతి శ్రీనివాసరావు దర్శకత్వంలో ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా, యాని, రేఖా నిరోషా హీరోయిన్స్ గా నూతన దర్శకుడు వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తికమక తాండ. ఈ సినిమా నేడు డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
కథ విషయానికొస్తే.. తికమక తాండ అనే ఒక గ్రామంలో ఊరందరికీ మతిమరుపు సమస్య ఉంటుంది. దీంతో ఆ సమస్యతో వాళ్ళు ఏమి మర్చిపోకుండా అన్ని పేర్లు పలకల మీద రాసుకుంటారు. ఆ మతిమరుపు సమస్య పోగొట్టడం కోసం ఆ ఊళ్ళో ఉన్న అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. కానీ ఆ ఊరులో ఉన్న అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అదే సమయంలో ఆ ఊరిని కొన్ని సమస్యలు చుట్టుముడతాయి. అసలు ఆ ఊరికి మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? అమ్మవారి విగ్రహం ఏమైంది? ఆ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? కవలలు అయిన హీరోలు ఆ ఊరిని ఎలా కాపాడారు అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. తికమక తాండ మొదటి హాఫ్ అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగుతుంది. విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి కథ సస్పెన్స్ గా సాగదీశారు. ఇంటర్వెల్ నుంచి కథ ఆసక్తిగా మారి సెకండ్ హాఫ్ సాగుతుంది. సెకండ్ హాఫ్ లో ఊళ్ళో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలు, వాటి కోసం హీరోలు చేసే పోరాటాలతో సాగుతుంది.
నటీనటుల విషయానికొస్తే.. హరికృష్ణ, రామకృష్ణ ఇద్దరు ట్విన్స్ ఈ సినిమాతో హీరోలుగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే నటనలో మెప్పించారని చెప్పొచ్చు. మన సినీ పరిశ్రమలో ట్విన్ అంటే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాత్రమే. మరి ఈ కొత్త ట్విన్స్ వారిలాగా పేరు తెచ్చుకుంటారేమో చూడాలి. ఇక రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన యాని ఈ సినిమాలో హీరోయిన్ గా మల్లిక పాత్రలో మెప్పించింది. హీరోయిన్ గా మొదటి సినిమాలోనే క్యూట్ గా కనిపించి అలరించింది. ఇంకో హీరోయిన్ రేఖా నిరోషా కూడా ప్రేమ సన్నివేశాల్లో మెప్పించింది. శివన్నారాయణ, బుల్లెట్ భాస్కర్, యాదమ్మ రాజు, రాకెట్ రాఘవ.. ఇలా పలువురు కమెడియన్స్ తమ పాత్రలతో నవ్విస్తారు.
Also Read : జోరుగా హుషారుగా మూవీ రివ్యూ.. ‘బేబీ’ సినిమా విరాజ్ అశ్విన్ హీరోగా మెప్పించాడా?
టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. దర్శకుడు వెంకట్.. గతంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, విక్రమ్ కుమార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర పనిచేశాడు. ఆ అనుభవంతో మంచి స్క్రిప్ట్ రాసుకొని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా అంతా పల్లెటూళ్ళో జరగడంతో కెమెరా విజువల్స్ లో గ్రామీణ లుక్స్ బాగా చూపించారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదనిపిస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ.. మెలోడీ సాంగ్ ప్రేక్షకులని మెప్పిస్తుంది.
ఇక తికమక తాండ సినిమా కాసేపు నవ్విస్తూ కాసేపు సస్పెన్స్ గా సాగుతూ ప్రేక్షకులని మెప్పిస్తుంది.