Shivaji Raja: మంచు విష్ణుకు ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా డిమాండ్ ఇదే!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ముగిసినా కూడా వివాదాలు మాత్రం ఆగట్లేదు.

Shivaji Raja: మంచు విష్ణుకు ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా డిమాండ్ ఇదే!

Shivaji

Updated On : October 11, 2021 / 7:07 PM IST

Shivaji Raja: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ముగిసినా కూడా వివాదాలు మాత్రం ఆగట్లేదు. ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన తర్వాత వరుసగా రాజీనామాల పర్వం నడుస్తోంది. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు ప్రకాశ్‌రాజ్‌పై ఘన విజయం సాధించారు. మంచు విష్ణు గెలిచిన తర్వాత మొదటగా మెగా బ్రదర్ నాగబాబు ”మా” అసోసియేషన్‌కి రాజీనామా చెయ్యగా.. తర్వాత ప్రకాష్ రాజ్ కూడా రాజీనామా చేశారు.

ఇదిలా ఉంటే ”మా”లో గొడవలకు మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కారణమంటూ పలుమార్లు విమర్శలు చేసిన ”మా” మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మరోసారి నరేష్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నరేష్ ఎప్పుడూ అబద్ధాలు చెబుతూనే ఉంటారని ‘మా’ ఎన్నికల్లో రచ్చకు కారణం అతనేనని విమర్శలు గుప్పించారు. నరేష్ ఆడే పాచికలాటలో ప్రాణ మిత్రులు కూడా విడిపోవాల్సి వచ్చిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు శివాజీ రాజా. ఈ ఎన్నికల్లో నరేష్ మంచు విష్ణు ప్యానెల్‌కి సపోర్ట్ చేశారు.

లేటెస్ట్‌గా శివాజీరాజా మా అసోసియేషన్ నిధుల వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో ”మా” అసోసియేషన్‌లో జరిగిన ఆర్ధిక లావాదేవీలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని ”మా” కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుని కోరనున్నట్లు ప్రకటించారు శివాజీ రాజా
.
కొత్త కమిటీ దీనిపై చర్యలు తీసుకోకుంటే తన తదుపరి కార్యాచరణ ఏంటో అప్పుడు ప్రకటిస్తానని శివాజీ రాజా అన్నారు.