ఈ వారం వంటలన్నీ క్యారెట్‌తోనే..

  • Published By: sekhar ,Published On : August 25, 2020 / 01:30 PM IST
ఈ వారం వంటలన్నీ క్యారెట్‌తోనే..

Updated On : August 25, 2020 / 2:33 PM IST

this week menu in Samantha’s house: లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని ప్రముఖ కథానాయిక సమంత అక్కినేని బాగా వినియోగించుకుంటోంది. యోగా, ధ్యానం చేస్తూ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టింది. అలాగే తన ఇంటిపై వ్యవసాయం కూడా చేస్తోంది. తనకు కావాల్సిన ఆహారాన్ని తనే స్వయంగా పండించుకుంటోంది. వాటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.



తాజాగా సమంత తన ఇంటిపై క్యారెట్‌లను పండించింది. ఇక, ఈ వారమంతా క్యారెట్‌తోనే వంటలు చేయబోతోందట. ఈ విషయాన్ని సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘ఈ వారం మెనూ.. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ వేపుడు, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా’.. అంటూ ఈ వారమంతా క్యారెట్‌తో రకరకాల వంటకాలు చేయబోతున్నట్టు తెలిపింది సామ్.



https://www.instagram.com/p/CETWD72h4SM/?utm_source=ig_web_copy_link