This week Movies : ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

ఈ వారం తెలుగులో రెండు మీడియం సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ వారం హిందీలో పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ కావట్లేదు.

This week Movies : ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

This week theatrical releasing Movies

Updated On : May 2, 2023 / 10:08 AM IST

This week Movies : ఈ వారం తెలుగులో రెండు మీడియం సినిమాలు రిలీజవుతున్నాయి. గోపీచంద్, డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజయి ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

Image

అల్లరి నరేష్(Allari Naresh), మిర్నా జంటగా నాంది(Nandi) దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉగ్రం సినిమా కూడా మే 5న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇందులో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నాంది డైరెక్టర్ తో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ కాంబోపై అంచనాలు ఉండటంతో ఈ సినిమా కూడా హిట్ కొడుతుందని భావిస్తున్నారు.

 

Image

హీట్, అరంగ్రేటం అనే మరో రెండు చిన్న సినిమాలు తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి.

ఇక హిందీలో హమ్ బంజారా, అన్ వుమెన్, Afwaah సినిమాలు మే 5న రిలీజవుతున్నాయి. ఈ వారం హిందీలో పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ కావట్లేదు.

ఇక ది కేరళ స్టోరీ అనే సినిమా మలయాళం, హిందీలో మే 5న రిలీజ్ అవ్వబోతుంది. అదా శర్మ, సిద్ధి ఇదాని మెయిన్ లీడ్స్ లో కేరళలో అమ్మాయిలను మతం మర్చి టెర్రరిస్టుల్లో కలిసేలా చేస్తున్న రియల్ సంఘటనలపై ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై వివాదం నెలకొంది.

Image

 

మలయాళం లో ది కేరళ స్టోరీ సినిమాతో పాటు 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో 2018 అనే టైటిల్ తోనే మే 5న మరో సినిమా రాబోతుంది. ఈ సినిమాపై కేరళలో మంచి హైప్ ఉంది. అలాగే గౌతమ్ మీనన్, దేవయాని ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన అనురాగం అనే మరో సినిమా మే 5న రాబోతుంది.

ఇక ఈ వారం తమిళ్ లో కూడా పెద్ద సినిమాలేవీ లేవు. కులసామి అనే చిన్న సినిమా అమ్మాయి 5న రిలీజ్ కాబోతుంది.

హాలీవుడ్ లో గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా మే 5న రిలీజ్ కాబోతుంది.

Guardians of the Galaxy Vol. 3 Review - IGN