‘మీకు పైసలు ముఖ్యం, మాకు మనుషులు ముఖ్యం’ : ‘తోలుబొమ్మలాట’ – మోషన్ పోస్టర్

నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని తెలిపేలా తెరకెక్కుతున్న చిత్రం ‘తోలుబొమ్మలాట’.. మోషన్ పోస్టర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : October 11, 2019 / 11:39 AM IST
‘మీకు పైసలు ముఖ్యం, మాకు మనుషులు ముఖ్యం’ : ‘తోలుబొమ్మలాట’ – మోషన్ పోస్టర్

Updated On : October 11, 2019 / 11:39 AM IST

నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని తెలిపేలా తెరకెక్కుతున్న చిత్రం ‘తోలుబొమ్మలాట’.. మోషన్ పోస్టర్ విడుదల..

‘ఆనలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఓనమాలు’, ‘ఓ బేబి!’, సినిమాలకు తన నటనతో వన్నె తెచ్చిన సీనియర్ నటుడు నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని తెలిపేలా తెరకెక్కుతున్న చిత్రం ‘తోలుబొమ్మలాట’..

ఐశ్వర్య మాగంటి సమర్పణలో, సుమ దుర్గా క్రియేషన్స్ బ్యానర్‌పై.. మాగంటి దుర్గా ప్రసాద్ నిర్మిస్తుండగా.. విశ్వనాధ్ మాగంటి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ‘తోలుబొమ్మలాట’.. మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రాజేంద్ర ప్రసాద్ రాసిన వీలునామాను ఉద్దేశించిన విజువల్స్‌తో రూపొందించిన వీడియో ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపచేసేలా ఉంది.

Read Also : డైరెక్టర్ బాబీ కుమార్తె బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీస్ సందడి..

డైలాగులు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ ‘సోమరాజు’ అలియాస్ ‘సోడాల్రాజు’ పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘తోలుబొమ్మలాట’ త్వరలో విడుదల కానుంది. సంగీత, విశ్వంత్, వెన్నెల కిషోర్, ధనరాజ్, నర్రా శ్రీను, దేవీ ప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : సురేష్ బొబ్బిలి.