Chandramukhi 2 : చంద్రముఖి నుంచి ‘థోరి బోరి’ లిరికల్ సాంగ్ రిలీజ్..

రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 నుంచి 'థోరి బోరి' లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

Chandramukhi 2 : చంద్రముఖి నుంచి ‘థోరి బోరి’ లిరికల్ సాంగ్ రిలీజ్..

Thori Bori Lyric song release from Raghava Lawrence Chandramukhi 2

Updated On : September 13, 2023 / 6:15 PM IST

Chandramukhi 2 : రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘చంద్రముఖి 2’ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ మూవీని వినాయక చవితి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే ‘సలార్’ పోస్ట్‌పోన్ అవ్వడంతో సెప్టెంబర్ 28కి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

7G Brindavan Colony : రీ రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసుకున్న 7G బృందావన్ కాలనీ..

తాజాగా మరో కొత్త సాంగ్ ని విడుదల చేశారు. ‘థోరి బోరి’ అనే లిరికల్ సాంగ్ ని చిత్ర యూనిట్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా భువనచంద్ర ఈ పాటకు లిరిక్స్ రాశాడు. అరుణ్ కౌడిన్య, అమల చేబోలు పాటని పాడారు. కాల, దినేష్, బాబా భాస్కర్ పాటకి డాన్స్ కోరియోగ్రఫీ చేశారు. సాంగ్ వినడానికి చాలా బాగుంది. ఇక అందమైన పాటని అంతే అందంగా చిత్రీకరించారు. మరి ఆ సాంగ్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.

Hi Nanna : మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తానంటున్న నాని..

ఈ మూవీ 2005 లో వచ్చిన రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా వస్తుంది. ఆ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ సీక్వెల్ కూడా అలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. రజిని చంద్రముఖిని తెరకెక్కించిన దర్శకుడే ఈ సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.