Tiger Nageswara Rao : ‘ఇచ్చేసుకుంటాలే’ లిరికల్ సింగల్ రిలీజ్.. సినిమాలో ప్రతి పాత్ర రియల్ అంట..
టైగర్ నాగేశ్వరరావు మూవీలో చూపించే పాత్రలు అన్ని నిజంగానే ఉన్నావా..? లేక నాగేశ్వరరావు పాత్ర చుట్టూ ఏమన్నా ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేస్తున్నారా..? అనే ఒక డౌట్ ఉంది. ఈ విషయంపై..

Tiger Nageswara Rao is complete biopic and Icchesukuntaale song release
Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. నూతన దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తుంటే.. రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తూ వస్తున్న మూవీ టీం.. తాజాగా మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. రవితేజ, గాయత్రి భరద్వాజ్ మధ్య.. ‘ఇచ్చేసుకుంటాలే’ అంటూ సాగే డ్యూయెట్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లిరికల్ సాంగ్ లో చూపించిన కొన్ని విజువల్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. సాంగ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.
Also read : VD13 Movie : ఫ్యామిలీ స్టార్..? కుటుంబరావు..? టీజర్‌తో రిలీజ్ డేట్ అండ్ టైటిల్‌పై క్లారిటీ..!
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న మూవీ టీం.. తాజాగా మరో ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో ఒక డౌట్ కి క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మూవీలో చూపించే పాత్రలు అన్ని నిజంగానే ఉన్నావా..? లేక నాగేశ్వరరావు పాత్ర చుట్టూ ఏమన్నా ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేస్తున్నారా..? అనే ఒక డౌట్ ఉంది. ఈ విషయాన్ని దర్శకుడు వంశీని ప్రశ్నించగా.. సినిమాలో వచ్చే ప్రతి పాత్ర రియల్ అంటూ బదులిచ్చాడు. మరి కంప్లీట్ బయోపిక్ గా వస్తున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.
A slight delay in the 3rd single release.
Meanwhile catch young director @SandeepRaaaj in coversation with our #TigerNageswaraRao @RaviTeja_offl & Director @DirVamsee in a MASS MASALA DISCUSSION ??
Promo Out Now!
– https://t.co/by5volPzpaFull Discussion out tomorrow at… pic.twitter.com/k7RbBnH5ZL
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 12, 2023