Tiger Nageswara Rao producer Abhishek Agarwal comments about Ram Charan
Ram Charan : రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఈ నిర్మాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
రామ్ చరణ్, తన స్నేహితుడు విక్రమ్ కలిసి V మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ బ్యానర్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్ తో కలిసి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ది ఇండియా హౌస్’. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ లోకి రామ్ చరణ్ ఎలా వచ్చాడో అనేది నిర్మాత అభిషేక్ తెలియజేశాడు. ఈ సినిమా కథ విన్న తరువాత.. రామ్ చరణ్ ని ఒకసారి వినమని నిర్మాత చెప్పాడట. ఆ కథ రామ్ చరణ్ కి బాగా నచ్చడంతో తాను నిర్మాణంలో భాగం అవుతానని మాట ఇచ్చాడట.
Also read : Nagarjuna : నాగార్జున సినిమాతో.. టైగర్ నాగేశ్వరరావు నిర్మాతకు గొడవ..
అలా రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడట. ఈ సినిమా నిర్మాణంలో 50 శాతం వాటా రామ్ చరణ్ కి ఉందని నిర్మాత వెల్లడించాడు. భారీ బడ్జెట్ తోనే ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఈ మూవీ స్వాతంత్ర సమరయోధుడు ‘వీర్ సావర్కర్’ బయోపిక్ గా రాబోతోందా..? అనే సందేహం నెలకుంది. దీని పై కూడా నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. వీర్ సావర్కర్ కి సంబంధించిన కథే గాని బయోపిక్ కాదు.
ఇప్పటివరకు దేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటాలే చూశారు. ఈ సినిమాతో దేశం బయట జరిగిన స్వాతంత్ర పోరాటం చూస్తారని పేర్కొన్నాడు. త్వరలోనే ఈ సినిమాని పట్టాలు ఎక్కించనున్నారట. భారీ స్కేల్ లో ఈ సినిమా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.