Ganapath Trailer : టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’ ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయే విజువల్స్‌తో కొత్త ప్రపంచంలో..

టైగర్ ష్రాఫ్ 'గణపథ్' టీజర్ చూసి సూపర్ హీరో కాన్సెప్ట్ తో రాబోతుంది అనుకున్నారు. అయితే ట్రైలర్ చూస్తుంటే..

Ganapath Trailer : టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’ ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయే విజువల్స్‌తో కొత్త ప్రపంచంలో..

Tiger Shroff Amitabh Bachchan Ganapath Trailer released

Updated On : October 10, 2023 / 12:52 PM IST

Ganapath Trailer : బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తున్న కొత్త సినిమా ‘గణపథ్’. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ ‘ఏ హీరో ఈజ్ బార్న్’ అనే ట్యాగ్ లైన్ తో రాబోతుంది. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇటీవల ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో హాలీవుడ్ రేంజ్ ఫీలింగ్ ఇవ్వబోతున్నారని ఆడియన్స్ ఫీల్ అయ్యారు.

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ వారి అంచనాలకు తగ్గట్టే ఉంది. ఈ సినిమాతో ఆడియన్స్ ని ఒక సరికొత్త లోకంలోకి తీసుకు వెళ్ళబోతున్నారు. 2070లో ఆధునిక టెక్నాలజీ మధ్య, మోడరన్ వెహికల్స్, వెపన్స్, యాక్షన్ సన్నివేశాలతో ఆడియన్స్ కి ఇవ్వబోతున్నారు. ఇక టైగర్ ష్రాఫ్ అంటే.. అదిరిపోయే యాక్షన్ స్టంట్స్ ని ఆశిస్తారు. ఆ అంచనాలకు తగ్గట్టు టైగర్ కూడా ఈసారి మరింత ఎనర్జీ స్టంట్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. మొత్తానికి ట్రైలర్ సినిమా పై అంచనాలు క్రియేట్ చేసింది.

Also read : Ambajipeta Marriage Band : సుహాస్ కొత్త మూవీ టీజర్ చూశారా.. ఈసారి రూరల్ యాక్షన్‌తో..

ఈ చిత్రాన్ని వికాస్ బాల్ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో టైగర్ ష్రాఫ్ అండ్ కృతి సనన్ నటించిన ‘హీరోపంతి’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో అభిమానులు.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి హిట్ కొడతారని ఆశిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ దసరాకి అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంతో టైగర్ ష్రాఫ్ సౌత్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.