Ganapath : ప్రభాస్ 2898 AD.. టైగర్ ష్రాఫ్ 2070 AD.. కల్కి వర్సెస్ గణపథ్..

బాలీవుడ్(Bollywood) హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) హీరోగా కృతి సనన్(Kriti Sanon) హీరోయిన్ గా, అమితాబ్(Amitabh Bachchan) ముఖ్య పాత్రలో వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గణపథ్.

Ganapath : ప్రభాస్ 2898 AD.. టైగర్ ష్రాఫ్ 2070 AD.. కల్కి వర్సెస్ గణపథ్..

Tiger Shroff Kriti Sanon Bollywood Movie Ganapath Teaser Released Audience Comparing with Prabhas Kalki 2898 AD Movie

Updated On : September 29, 2023 / 1:41 PM IST

Ganapath Teaser : ప్రభాస్(Prabhas) నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజయిన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ టీజర్ చూసి.. ఇది 2898లో కలియుగాంతంలో జరిగే కథ అని, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఓ హీరో పుట్టుకొస్తాడు అని అర్ధమవుతుంది. అయితే టైగర్ ష్రాఫ్ నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే ఉండబోతున్నట్టు సమాచారం.

బాలీవుడ్(Bollywood) హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) హీరోగా కృతి సనన్(Kriti Sanon) హీరోయిన్ గా, అమితాబ్(Amitabh Bachchan) ముఖ్య పాత్రలో వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గణపథ్. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో కూడా.. 2070లో జరిగే స్టోరీ అని, ప్రజలు కష్టాలు పడుతుంటే ఓ హీరో పుట్టుకొస్తాడని చూపించారు. ఈ టీజర్ లో కూడా భవిష్యత్ టెక్నాలజీని చూపించారు. వాటితో పాటు హీరో బాక్సింగ్ చేస్తున్నట్టు కూడా ఉంది.

గణపథ్ తెలుగు టీజర్ చిరంజీవి విడుదల చేశారు. గణపథ్ సినిమా ఈ దసరాకి అక్టోబర్ 20న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారింది. ఎందుకంటే గణపథ్ టీజర్ చూస్తుంటే ఆల్మోస్ట్ కల్కి టీజర్ చూసినట్టే అనిపిస్తుంది. కొన్ని ఛేంజెస్ కనపడినా కథ మాత్రం ఒకటేనేమో అని సందేహం కలుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ కల్కి సినిమాని టైగర్ గణపథ్ సినిమాని కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Also Read : Allu Arjun : బన్నీ భార్యకు పుట్టిన రోజుకి గిఫ్ట్ గా.. క్రిష్ – అల్లు అర్జున్ యాడ్ రిలీజ్

ప్రభాస్ కల్కి సినిమాలా అనిపించడంతో గణపథ్ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమా చూడాలని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ రెండు సినిమాల కథలు ఒకటేనా వేర్వేరా తెలియాలంటే ఈ సినిమాలు వచ్చేదాకా ఆగాల్సిందే.