×
Ad

Tollywood Hero : నాకు పేరు పెట్టింది ఆయనే.. సత్యసాయితో చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి..

టాలీవుడ్ స్టార్ హీరో సత్యసాయితో ఆసక్తికర ఫోటో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేసారు. (Tollywood Hero)

Tollywood Hero

Tollywood Hero : భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ప్రస్తుతం ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఆయన 100వ పుట్టిన రోజు కావడంతో దేశవ్యాప్తంగా ఆయన అనుచరులు, అభిమానులు శుభాకాంక్షలు చెప్తూ ఆయనతో ఉన్న అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో సత్యసాయితో ఆసక్తికర ఫోటో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేసారు.

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చిన్నప్పుడు పుట్టపర్తిలో సత్యసాయి స్కూల్ లో చదివిన సంగతి తెలిసిందే. విజయ్ చిన్నపుడు తన ఫ్రెండ్స్ తో కలిసి సత్య సాయి బాబాతో దిగిన ఫోటోని షేర్ చేసాడు.

Also Read : Vrushakarma : నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ ‘వృషకర్మ’.. దీని అర్ధం ఏంటో తెలుసా?

ఈ ఫోటోని షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే స్వామి. నాకు నెలల వయసు ఉన్నప్పుడు విజయ్ సాయి అని మీరు పేరు పెట్టారు. నేను ప్రతిరోజూ జీవించడానికి ఆ పేరు పని చేస్తుంది. మీరు మాకు ఒక మంచి వాతావరణం ఇచ్చారు. మేము అక్కడ చదువుకొని బోలెడన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. మేమందరం ప్రతిరోజూ మీ గురించే ఆలోచిస్తాము. ముఖ్యంగా మంచి, చెడు సమయాల్లో. ప్రపంచానికి మనం చేయగలిగినంత చేయాలి అనే ఆలోచనను మీరు మాలో పెంచారు. ఎందుకంటే మేము అవసరాల్లో ఉన్నప్పుడు అది మేము అందుకున్నాము. అది మా జీవితాల్లో ఎలాంటి మార్పును తెచ్చిందో మాకు తెలుసు. 100వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎప్పటికి మీరు జీవించే ఉంటారు అని రాసుకొచ్చారు.

దీంతో విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్ గా మారగా ఈ ఫొటోలో విజయ్ ఎక్కడ ఉన్నాడో అని నెటిజన్లు, ఫ్యాన్స్ వెతికి పోస్టులు చేస్తున్నారు. ఈ ఫొటోలో విజయ్ కుడి వైపు లాస్ట్ కి మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు. స్కూల్ టైం లో భలే క్యూట్ గా, అమాయకంగా ఉన్నాడు విజయ్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Adah Sharma : ఇటీవలే వరుస హిట్స్.. అంతలోనే హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం..