హాస్పిటల్‌లో చేరిన సునీల్ – ఆందోళనలో అభిమానులు

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు, కథానాయకుడు సునీల్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు..

  • Published By: sekhar ,Published On : January 23, 2020 / 06:46 AM IST
హాస్పిటల్‌లో చేరిన సునీల్ – ఆందోళనలో అభిమానులు

Updated On : January 23, 2020 / 6:46 AM IST

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు, కథానాయకుడు సునీల్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు..

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు, కథానాయకుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయణ్ణి కుటుంబ సభ్యులు మాదాపూర్ ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆధర్వంలో సునీల్‌కు వైద్య సేవలందిస్తున్నారు. సునీల్ హాస్పిటల్‌లో చేరారు అనే వార్త తెలియగానే టాలీవుడ్ పరిశ్రమతో పాటు ఆయన అభిమానుల్లోనూ ఆందోళన మొదలైంది. ‘సునీల్ గత వారం రోజులుగా జ్వరం తో బాధ పడుతున్నారని, గొంతు నొప్పితో పాటు యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల లంగ్స్ త్రొట్‌లో ఇన్ఫెక్షన్ అయ్యిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సునీల్‌కి చికిత్స జరుగుతుందని.. ఆయన ఆరోగ్యం గురించి ఎటువంటి వదంతులు నమ్మవద్దని సునీల్ మేనేజర్ తెలిపారు. 

 

 

Read Also : బోయపాటిని పరామర్శించిన బాలయ్య

ఇక సినిమాల విషయానికొస్తే హీరోగా సరైన హిట్ పడక తిరిగి కమెడియన్‌గా బిజీ అయిన సునీల్ నటించిన ‘డిస్కో రాజా’ జనవరి 24న విడుదల కానుంది. ఆయన నటిస్తున్న మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి..