Naresh : అరుదైన గౌరవం అందుకున్న నరేష్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ సర్ డాక్టర్ నరేష్..

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నుంచి అరుదైన గౌరవం అందుకొని తొలి భారతీయ నటుడిగా నిలిచిన నరేష్. ఇప్పుడు ఆయనను ఏమని పిలువలో తెలుసా..?

Naresh : అరుదైన గౌరవం అందుకున్న నరేష్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ సర్ డాక్టర్ నరేష్..

Tollywood Actor Vijaya Krishna Naresh got rare and great honour

Updated On : November 26, 2023 / 10:49 AM IST

Naresh : సీనియర్ నటుడు నరేష్ ఇటీవలే సినీ పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. తాజాగా ఈయన ఒక అరుదైన గౌరవం అందుకున్నారు. మనలో చాలామందికి నరేష్ ఒక నటుడిగా, నిర్మాతగా మాత్రమే తెలుసు. కానీ ఉగ్రవాదం మీద పోరాడే ఒక సామజికవేత్త అని చాలా తక్కువమందికి తెలుసు. ప్రపంచ సమస్యలపై లోతైన అవగాహన ఉన్న నరేష్.. పలు అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక ప్రసంగాలు ఇచ్చారు. ఈక్రమంలోనే తాజాగా నరేష్ అరుదైన గౌరవం అందుకున్నారు.

ఐక్యరాజ్య సమితి మరియు ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్‌లో (NASDP) ముఖ్య విభాగమైన ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ISCAHR) రీసెంట్ గా ఫిలిప్పీన్స్‌లోని కుజాన్ సిటీలో ఐదవ ప్రపంచ కాంగ్రెస్‌ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో NASDP లోని ముఖ్య ప్రముఖులు, మిలటరీ జనరల్స్, ఫిలిప్పీన్స్ మరియు థాయిలాండ్ కి చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇలాంటి సదస్సులో నరేష్‌ కూడా పాల్గొనే గౌరవం అందుకోవడమే కాకుండా అక్కడ అరుదైన గౌరవాలను కూడా అందుకున్నారు.

Also read : Bigg Boss 7 Day 83 : ఆమె ఎలిమినేషన్.. మళ్ళీ బుజం నొప్పితో శివాజీ బయటకి..

ఈ సదస్సులో పాల్గొనే ముందు నరేష్.. పోలీస్ అండ్ డిఫెన్స్ నేషనల్ హెడ్‌క్వార్టర్స్‌లో ‘కౌంటర్ టెర్రరిజం అండ్ హ్యూమన్ రిలేషన్స్’ పై ఇచ్చిన లెక్చర్ అధికారులను, అతిథులను ఆకట్టుకుంది. ఇక నరేష్ సర్వీస్ లను గుర్తించిన ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ.. ఆయనని ‘సర్’ అనే అత్యున్నత బిరుదుతో గౌరవించారు. అలాగే మిలటరీ ఆర్ట్స్ అండ్ హ్యూమన్ సర్వీస్‌ల్లో ‘డాక్టరేట్’ గౌరవని అందించారు. కాగా ఏడేళ్ల క్రిందట న్యూయార్క్‌కు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ నుంచి కూడా నరేష్‌ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

అలాగే ఆర్బిట్రేషన్ అండ్ పీస్ మీడియేషన్‌ లో సభ్యుడిగా, గుడ్‌విల్‌ అంబాసిడర్‌‌గా, సివిల్ రైట్స్ డిఫెండర్‌‌గా, లెఫ్టినెంట్‌ కల్నల్‌గా కూడా నరేశ్‌ నియమితులయ్యారు. ఇక ఈ వరల్డ్ కాంగ్రెస్‌ లో నరేష్‌కి దక్కిన గౌరవాలు, బిరుదలు, బాధ్యతలు వలన ఆయనని మనం.. ఏఎంబీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ సర్ డాక్టర్ నరేష్ విజయకృష్ణ పీహెచ్‌డి అని పిలవాలి. ఇలాంటి గౌరవాలు అందుకున్న తొలి భారతీయ నటుడిగా నరేష్ నిలిచారు.