Mounika Reddy : అవును వాళ్లిద్దరూ.. విడాకుల వార్తలపై మౌనిక రెడ్డి కామెంట్స్..
పెళ్ళై ఏడాది కూడా అవ్వకుండానే టాలీవుడ్ యాక్ట్రెస్ మౌనిక రెడ్డి విడాకులు తీసుకుంటుందంటూ కొన్ని రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై మౌనిక..

Tollywood Actress Mounika Reddy reaction on her divorce news
Mounika Reddy : టాలీవుడ్ యాక్ట్రెస్ మౌనిక రెడ్డి.. ‘భీమ్లానాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన ముఖ్య పాత్రలో నటించి టాలీవుడ్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. దీంతో ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే ఇంతలోనే పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసింది. గత ఏడాది డిసెంబర్ లో తన స్నేహితుడు ‘సందీప్ కురపాటి’ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలు గోవాలో రెండు రోజులు పాటు కుటుంబసభ్యులు మరియు స్నేహితులు మధ్య ఘనంగా జరిగింది.
అయితే రీసెంట్ గా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫోటోలను హైడ్ చేసినట్లు ఉంది. ఇక తన అకౌంట్ ఆ ఫోటోలు కనిపించకపోవడంతో మౌనిక విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఇక న్యూస్ చూసిన నెటిజెన్స్.. ‘పెళ్ళై ఏడాది కూడా అవ్వకుండానే విడాకులు తీసుకోవడం ఈ సెలబ్రిటీస్ కి బాగా అలవాటు అయ్యిపోయింది’ అంటూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఈ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలిచింది. అయితే తాజాగా దీనిపై మౌనిక రియాక్ట్ అయ్యింది.
Also Read : Siddharth : కన్నడలో జరిగిన దానికి కూడా పెద్ద బాధ పడలేదు.. కానీ తెలుగులో.. స్టేజిపై ఏడ్చేసిన సిద్దార్థ్..
తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పోస్ట్ వేసింది. తన హస్బెండ్ తో ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. తనకి తన హస్బెండ్ కి మధ్య జరిగిన సంభాషణ పెట్టింది. ‘మనం ట్రేండింగ్ లో ఉన్నాం’ అని మౌనిక చెప్పగా, తన భర్త రియాక్ట్ అవుతూ.. ‘ఏ పిఆర్ అయినా మంచి పిఆర్‌గా’ అంటూ సరదాగా బదులిచ్చాడు. అలాగే ఆ పోస్టులో.. ‘సోషల్ మీడియాలో ఏవేవో వస్తుంటాయి. అవి పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వెళ్లిపోవడమే’ అని కూడా రాసుకొచ్చింది. దీంతో విడాకుల వార్తలు కేవలం రూమర్లు మాత్రమే అని అర్ధమైంది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ‘అవును వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు’ అంటూ పోస్టులు పెడుతున్నారు.