Sowmya Janu : తనని అరెస్ట్ చేయొద్దంటూ.. కోర్టును ఆశ్రయించిన సౌమ్య జాను..

హోమ్ గార్డ్‌ దాడి కేసులో తనని అరెస్ట్ చేయొద్దంటూ కోర్టును ఆశ్రయించిన సౌమ్య జాను.

Sowmya Janu : తనని అరెస్ట్ చేయొద్దంటూ.. కోర్టును ఆశ్రయించిన సౌమ్య జాను..

Tollywood Actress Sowmya Janu approached high court for stay in home guard case

Updated On : March 6, 2024 / 1:38 PM IST

Sowmya Janu : టాలీవుడ్ నటి సౌమ్య జాను.. ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ లో జాగ్వార్ కారు నడుపుతూ రాంగ్ రూట్ లో ప్రయాణించడమే కాకుండా, ఆమె అడ్డుకొని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ హోమ్ గార్డు పై దాడికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ విషయంలో ఆమె బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్ లో 332,353,427,504,279 ఐపిసి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసారు.

ఇక ఈ కేసులో సౌమ్యని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే సౌమ్య ఇంతలో హైకోర్టుని ఆశ్రయించింది. తన పై నమోదైన కేసులో తనకి స్టే ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరింది. ఇక ఈ కేసుని విచారించిన న్యాయస్థానం.. ఆమెను అరెస్ట్ చేయకుండా 41A ప్రొసీడింగ్స్ తో ఫాలో అవ్వాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే సౌమ్యకి.. మార్చి 11వ తేదీన 11 గంటల నుండి 5 సమయంలో పోలిసుల ముందు ఇన్వెస్టిగేషన్ కి హాజరుకావాలంటూ ఆదేశించింది.

Also read : Allu Arjun : ఐకాన్ స్టార్ ఇంటిలో కూడా మిడిల్ క్లాస్ మంచాలు.. అంత సింప్లిసిటీనా..!

అసలు ఏమైందంటే.. ఫిబ్రవరి 24న బంజారా హిల్స్‌ సిగ్నల్ దగ్గర జాగ్వార్ కారు నడుపుతూ రాంగ్ రూట్ లో ప్రయాణించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ హోమ్ గార్డు ఆమెను అడ్డుకొని ప్రశ్నించారు. దానికి సౌమ్య రియాక్ట్ అవుతూ.. అర్జెంట్ పని ఉన్నప్పుడు రాంగ్ రూట్‌లో వెళ్తే తప్పేంటి..? నాలాంటి పెద్ద సెలెబ్రిటీనే ఇలా అడ్డుకొని గొడవ చేస్తున్నారంటే.. ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి..? అంటూ వీరంగం చేసింది. ఈక్రమంలోనే హోమ్ గార్డు పై దాడికి కూడా పాల్పడింది.

అంతేకాదు అక్కడితో ఆగిపోకుండా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు తనని విచారణకు పిలవలేదని, పిలిస్తే తాను కూడా హోం గార్డు మీద కేసు పెడతానని అంటూ వ్యాఖ్యానించింది.