Sowmya Janu : సెలబ్రిటీస్ రాంగ్ రూట్‌లో వెళ్తే తప్పేంటి.. తన తప్పుని సమర్ధించుకుంటున్న తెలుగు నటి..

సెలబ్రిటీస్ రాంగ్ రూట్‌లో వెళ్తే తప్పేంటి అంటూ ఓ తెలుగు నటి అందర్నీ ప్రశ్నిస్తుంది.

Sowmya Janu : సెలబ్రిటీస్ రాంగ్ రూట్‌లో వెళ్తే తప్పేంటి.. తన తప్పుని సమర్ధించుకుంటున్న తెలుగు నటి..

Tollywood Actress Sowmya Janu comments about telangana traffic home guard incident issue

Updated On : February 27, 2024 / 6:01 PM IST

Sowmya Janu : తమ టాలెంట్ తో ఏదో కూసంత ఫేమ్ ని సంపాదించుకున్న కొందరు నటీనటులు.. తమ తెలివితక్కువ పనులతో పోలీస్ కేసులు, స్టేషన్లు చుట్టూ తిరుగుతూ తమ ఇమేజ్ ని తామే నాశనం చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి విషయాలు చాలా ఎక్కువ అయ్యాయి. ఇక తాజాగా కుర్ర నటి ‘సౌమ్య జాను’.. తాను చేసిన ఒక తప్పుని సమర్ధించుకుంటూ విమర్శలు ఎదుర్కొంటుంది.

ఇటీవల ఈ భామ హైదరాబాద్ సిటీలోని ఓ హోమ్ గార్డ్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. జాగ్వార్ కారు నడుపుతూ రాంగ్ రూట్ లో ప్రయాణించిన సౌమ్యని.. బంజారా హిల్స్‌ ట్రాఫిక్ హోమ్ గార్డు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్నందుకు ఆమె ఆ హోమ్ గార్డు పై దాడికి పాల్పడింది. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఈ విషయం పై పోలీసులు ఆమె పై కేసు కూడా నమోదు చేసారు.

Also read : Mahesh Babu : అలియా భట్ వెబ్ సిరీస్‌కి.. మహేష్ బాబు ఎమోషనల్ రివ్యూ.. అలా ఎలా చేస్తారంటూ..!

కాగా సౌమ్య జాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమెను ఆ సంఘటన గురించి ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. “అర్జెంట్ పని ఉన్నప్పుడు రాంగ్ రూట్‌లో వెళ్తే తప్పేంటి..? నాలాంటి పెద్ద సెలెబ్రిటీనే ఇలా అడ్డుకొని గొడవ చేస్తున్నారంటే.. ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి..?” అని ప్రశ్నలు వేస్తూ తన తప్పుని సమర్ధించుకుంటూ వచ్చింది.

తన మీద కేసు నమోదు అయ్యినప్పటికీ ఇప్పటివరకు తనని విచారణకు పిలవలేదని, తాను కూడా హోం గార్డు మీద కేసు పెడతానని ఆమె పేర్కొంది. ఇక చేసిన తప్పుని ఇలా సమర్ధించుకుంటూ ఉన్న ఈ నటి పై నెటిజెన్స్ పలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా ఈమె చందమామ కథలు, లయన్, తడాఖా వంటి సినిమాల్లో నటించింది.