VN Aditya : అమెరికా యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న టాలీవుడ్ దర్శకులు వీఎన్ ఆదిత్య..
మనసంతా నువ్వే, నేనున్నాను వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన దర్శకులు వీఎన్ ఆదిత్య.. అమెరికా యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.

Tollywood director VN Aditya honoured by doctorate from george washington university of peace
VN Aditya : టాలీవుడ్ ఆడియన్స్ ని మనసంతా నువ్వే, నేనున్నాను వంటి సినిమాలతో అలరించిన దర్శకుడు ‘వీఎన్ ఆదిత్య’. ప్లెజంట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న వీఎన్ ఆదిత్య.. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమకు సేవలు అందిస్తూ వస్తున్నారు. సినిమా దర్శకుడిగా పలు అవార్డులు అందుకున్న వీఎన్ ఆదిత్య.. తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్.. వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేసింది. ఇక సినిమా రంగం నుంచి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో ఈ అవార్డుల ప్రధాన చేశారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ Mr నీలమణి, నేషనల్ SC & ST కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు.
Also read : Nani32 : నాని, సుజిత్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చేసింది.. రజినీకాంత్ ‘బాషా’ రేంజ్‌లో..
ఇక డాక్టరేట్ అందుకున్న వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నా. నేను సినీ రంగంలో కాకుండా విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలని అమ్మ కోరుకుంది. నేను ఇష్టపడిన సినిమా రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు అమ్మకు కూడా సంతోషాన్ని ఇచ్చే విషయం. నాకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వారికి కృతజ్ఞతలు చెబుతున్నా” అన్నారు. ఇక గౌరవ అవార్డు అందుకున్న వీఎన్ ఆదిత్యకు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.