Tollywood fans are angry with Dil Raju
Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజుపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, తమిళ ఇళయదళపతి విజయ్ తో కలిసి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “వారసుడు”. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కనుకుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Varasudu: వంశీ పైడిపల్లి విజయ్ తో తెరకెక్కిస్తున్న “వారసుడు” సినిమా ‘మహర్షి’ ప్రీమేక్?
ఇక విషయానికి వస్తే సంక్రాంతి భారీలోనే టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలయ్య – ‘వీరసింహారెడ్డి’, చిరు – ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అయితే దిల్ రాజు ఈ రెండు సినిమాలు కంటే అధికంగా ‘వారసుడు’ మూవీ కోసం స్క్రీన్ లు ఆక్రమించాడట. ఇటీవలే వారసుడు బైలింగ్వల్ చిత్రం కాదు కంప్లీట్ తమిళ మూవీ అని ప్రకటించారు. దీంతో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బింగ్ మూవీకి ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు.
కాగా 2019 సంక్రాంతి సమయంలో రజినీకాంత్ ‘పేట’ తో పాటు తెలుగు మూవీస్ ‘వినయ విధయ రామ’, ‘ఎఫ్-2’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ బరిలో నిలిచాయి. ఆ సమయంలో.. తెలుగు మూడు సినిమాలని కాదని డబ్బింగ్ మూవీకి ఎక్కువ థియేటర్లు ఎలా కేటాయించగలం అంటూ ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడిన వీడియోని రీ ట్వీట్ చేస్తూ నెటిజెన్లు దిల్ రాజుని నిలదీస్తున్నారు.
Remembering once Dil Words about 2019 Sankranthi.#WaltairVeerayya#VeeraSimhaReddy#Vaarasudu pic.twitter.com/F2nLacPML0
— Ashton Finleh (@finleh39) November 9, 2022