Varasudu: వంశీ పైడిపల్లి విజయ్ తో తెరకెక్కిస్తున్న “వారసుడు” సినిమా ‘మహర్షి’ ప్రీమేక్?

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం "వారసుడు". తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సెట్స్ నుంచి లీక్ అయ్యాయి. అవి కాస్త నెట్టింట వైరల్ కావడంతో..

Varasudu: వంశీ పైడిపల్లి విజయ్ తో తెరకెక్కిస్తున్న “వారసుడు” సినిమా ‘మహర్షి’ ప్రీమేక్?

Vamsi Paidipalli's movie Varasudu with Vijay is a premake of Maharshi

Varasudu: టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వారసుడు”. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కనుకగా విడుదల కానుంది.

Vaarasudu: వారసుడు ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ఆపర్..?

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సెట్స్ నుంచి లీక్ అయ్యాయి. అవి కాస్త నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజెన్లు వాటిని చూసి ఈ మూవీ మహేష్ ‘మహర్షి’ సినిమాకి ప్రీమేక్ గా వస్తున్నట్లు ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం ‘మహర్షి’లోని మహేష్ లుక్స్ మరియు ‘వారసుడు’లోని విజయ్ లుక్స్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ ఒకేలా ఉండడం.

ఈ రెండు సినిమాలకి దర్శకుడు కూడా ఒకరే అవ్వడం. అలాగే మహేష్ సినిమాలోనూ కొన్ని ముఖ్యపాత్రలు కూడా ఈ సినిమాలో కనిపించడంతో ఈ వార్తలు నిజమనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలను మహేష్ ఫొటోలతో జత చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు నెటిజెన్లు. కాగా మొదటిలో ఈ సినిమా బై లింగువల్ గా తెరకెక్కిస్తున్నాము అని ప్రకటించిన మేకర్స్, ఇప్పుడు ఇది కేవలం తమిళ మూవీ తెలుగులోకి డబ్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు.