Venkatesh : సైలెంట్‌గా వెంకటేష్ కూతురి వివాహం.. మెహందీ సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు ఫ్యామిలీ..

సైలెంట్‌గా వెంకటేష్ కూతురి వివాహం. నిన్న నైట్ మెహందీ వేడుక జరగగా.. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత, సితార హాజరయ్యారు.

Venkatesh : సైలెంట్‌గా వెంకటేష్ కూతురి వివాహం.. మెహందీ సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు ఫ్యామిలీ..

Tollywood hero Venkatesh silently finishing his dauguter marriage

Updated On : March 15, 2024 / 10:26 AM IST

Venkatesh : టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ ఇటీవల తన రెండో అమ్మాయికి నిశ్చితార్థం వేడుక జరిపిన సంగతి అందరికి తెలిసిందే. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి వెంకటేష్ తన రెండో కుమార్తెని ఇవ్వబోతున్నారు. అక్టోబర్ లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కి దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు చిరంజీవి, మహేష్ బాబు ఫ్యామిలీస్ కూడా హాజరయ్యి కొత్త జంటని ఆశీర్వదించారు.

ఇక నిశ్చితార్థం వేడుక జరుపుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి పండుగతో ఒకటి కాబోతున్నారు. వెంకటేష్ సైలెంట్ గా ఎటువంటి హడావుడి లేకుండా తన కూతురి పెళ్లిని జరిపించేస్తున్నారు. ఈ వివాహం నేడు మార్చి 15న జరగబోతుందట. రామానాయుడు స్టూడియోస్ లో కేవలం కుటుంబసభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య వీరి వివాహ వేడుక జరగనుంది. ఆల్రెడీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

Also read : Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కోసం వైజాగ్‌కి చరణ్.. ఫ్యాన్స్‌ని చూసి షాక్ అయిన ఎస్‌జె సూర్య..

నిన్న నైట్ మెహందీ వేడుక జరగగా.. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత, సితార హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మొన్న నిశ్చితార్థం వేడుకని సైలెంట్ గా చేసేసిన వెంకటేష్.. ఇప్పుడు పెళ్లి వేడుకని కూడా చాలా సింపుల్ గా చేసేస్తున్నారు. కాగా వెంకటేష్ కి మొత్తం ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి చేసేసారు వెంకటేష్.