Nachinavadu : నచ్చినవాడు రివ్యూ.. ప్రేమించిన అమ్మాయికి పెళ్లయిందని తెలిస్తే ? పెళ్లయిన అమ్మాయి ప్రేమిస్తే ?
దర్శక-నిర్మాత లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'నచ్చినవాడు'. కావ్య రమేష్ హీరోయిన్‌గా..

Tollywood New love story movie Nachinavadu review
Nachinavadu : ఏనుగంటి ఫిలిం జోన్ బ్యానర్ పై దర్శక-నిర్మాత లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నచ్చినవాడు’. కావ్య రమేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నేడు సెప్టెంబర్ 22న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విడుదలవుతుంది.
Cool Suresh : లేడీ యాంకర్‌తో తమిళ నటుడు తప్పు ప్రవర్తన.. భార్య అభ్యంతరంతో క్షమాపణలు..
కథ విషయానికి వస్తే.. మనసుకు నచ్చే అమ్మాయి దొరికేదాకా పెళ్లి చేసుకోను అనే హీరోకి ఒక అమ్మాయి నచ్చగా.. ఆ అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి అయిన సంగతి, ఆ పెళ్లి సమస్యల్లో ఉన్న సంగతి తెలుస్తుంది. దీంతో హీరో ఎలా రియాక్ట్ అవుతాడు? ఆ అమ్మాయి ఏమని సమాధానమిస్తుంది? ఆ అమ్మాయి కూడా హీరోని లవ్ చేసిందా అనేది తెరపై చూడాలి.
Vishal : రైతులకు కేజీఎఫ్ హీరో ‘యశ్’ చేసే సహాయం గురించి ఎవరికి తెలియదు..
సినిమా మొత్తం బెంగుళూరులోనే జరుగుతుంది. దీంతో అక్కడక్కడా కన్నడ భాషని కూడా మిక్స్ చేశారు. నిర్మాణ విలువలు, డైరెక్షన్ మాత్రం బాగుంది. ఖర్చుపెట్టిన డబ్బు తెరపై కనిపిస్తుంది. బెంగుళూరు, పాండిచ్చేరి, పలు ప్రదేశాలను చాలా బాగా చూపించారు. పాటలు కూడా కొత్తగా ఉన్నాయి. అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ అయింది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అలాగే డబ్బింగ్ కూడా అక్కడక్కడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. మొత్తానికి సరదాగా సాగిపోతుంది నచ్చినవాడు సినిమా. ఒక అమ్మాయికి నచ్చినవాడు ఎవరు అనేదే ఈ ‘నచ్చినవాడు’ సినిమా.