ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టగా.. సినిమా షూటింగ్‌లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది.
తెలుగు సినిమా నిర్మాత పోకూరి రామారావు(64) శనివారం(04 జులై 2020) ఉదయం తొమ్మిది గంటలకు కన్నుమూశారు.
ఈతరం ఫిలింస్ పోకూరి బాబూరావు సోదరుడే పోకూరి రామారావు. ఇటీవల పోకూరి రామారావుకి కరోనా సోకగా.. హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
అయితే పరిస్థితి విషమించడంతో పోకూరి రామారావు ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈతరం ఫిలింస్ బ్యానర్‌లో రూపొందిన సినిమాలకు ఈయన సమర్పకుడిగా వ్యవహరించారు.
Read:ఆమె నా తొలి కొరియోగ్రాఫర్.. సరోజ్ ఖాన్ మృతి పట్ల సంతాపం తెలిపిన బన్నీ..