Movie Reviews : మీడియా వర్సెస్ నిర్మాతలు.. సినిమా రివ్యూలపై చర్చలు.. దిల్ రాజు సవాల్..

తాజాగా కోటబొమ్మాళి PS సినిమా ప్రమోషన్స్ లో కొత్తగా మీడియా వాళ్ళని స్టేజిపై కూర్చోపెట్టి కొంతమంది నిర్మాతలు కింద కూర్చున్నారు.

Movie Reviews : మీడియా వర్సెస్ నిర్మాతలు.. సినిమా రివ్యూలపై చర్చలు.. దిల్ రాజు సవాల్..

Tollywood Producers and Media Discussions on Movie Reviews

Updated On : November 21, 2023 / 1:26 PM IST

Movie Reviews : సినీ పరిశ్రమలో ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఫ్లాప్ అవుతాయి అనుకున్న సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అయితే రివ్యూల విషయంలో మాత్రం సినీ పరిశ్రమలో ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి.

సినిమా రిలీజ్ అవ్వగానే చాలా మంది వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ తమకి అనిపించింది రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉంటారు. ఇది కొంతవరకు సినిమాలకు మైనస్ అవుతుంది. నెగిటివ్ రివ్యూలు వస్తే సినిమాలపై ఎఫెక్ట్ పడి కలెక్షన్స్ కూడా దెబ్బ తింటాయి. దీనిపై అప్పుడప్పుడు నిర్మాతలు ఫైర్ అవుతూనే ఉంటారు. తాజాగా కోటబొమ్మాళి PS సినిమా ప్రమోషన్స్ లో కొత్తగా మీడియా వాళ్ళని స్టేజిపై కూర్చోపెట్టి కొంతమంది నిర్మాతలు కింద కూర్చున్నారు.

పలువురు సీనియర్ జర్నలిస్టులు స్టేజిపై కూర్చోగా నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, SKN, బన్నీ వాసు.. పలువురు కింద కూర్చొని ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో రివ్యూల గురించి డిస్కషన్ వచ్చింది. నిర్మాతలు.. సినిమా రిలీజ్ కి ముందే కొంతమంది రివ్యూలు ఇచ్చి సినిమాని చంపేస్తున్నారని, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే సినిమా గురించి మరింత వరస్ట్ గా రాస్తున్నారని దాని వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారని అన్నారు.

దిల్ రాజు.. ఒక సినిమా స్క్రిప్ట్ ముందే మీకిస్తాను, మీకు నచ్చిన మార్పులు చేసి మీరు 4 రేటింగ్ ఇచ్చిన తర్వాతే షూట్ కి వెళ్తాను. అప్పుడు సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ ఇవ్వగలరా? నేను డబ్బులు పెడతాను ఒక సినిమాకి, ఈ పద్దతిలో చేద్దామా అంటూ మీడియాకి సవాల్ విసిరారు. మీడియా వాళ్ళు.. ఇది సాధ్యపడదని, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు అని చెప్పారు.

Also Read : Bigg Boss 7 Day 78 : మొదలైన నామినేషన్స్.. అశ్విని ఇలా చేసిందేంటి?

అలాగే రివ్యూలు కూడా ఒకప్పుడు కొంతమందే రాసేవారని, ఇప్పుడు చాలా సైట్స్ వచ్చాయి. అలాగే మన కంటే ముందే అమెరికాలో, ఇంకెక్కడో సినిమాలు రిలీజ్ అయితే ముందు అక్కడి నుంచే రివ్యూలు వస్తున్నాయి. టెక్నాలజీ పెరిగాక రివ్యూలు ఆపడం మనవల్ల కాదు అని మీడియా సమాధానమిచ్చింది. ఇలా రివ్యూల గురించి నిర్మాతలు, మీడియా మధ్య కాసేపు చర్చ జరిగింది.