Bigg Boss 7 Day 78 : మొదలైన నామినేషన్స్.. అశ్విని ఇలా చేసిందేంటి?

ఇక సోమవారం ఎప్పటిలాగే నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ వారం నామినేషన్స్ లో వెరైటీగా ఒక గుహలో ఏర్పాటు చేశారు.

Bigg Boss 7 Day 78 : మొదలైన నామినేషన్స్.. అశ్విని ఇలా చేసిందేంటి?

Bigg Boss 7 Day 78 Highlights Nominations Day

Updated On : November 21, 2023 / 6:56 AM IST

Bigg Boss 7 Day 78 : ఆదివారం ఎలిమినేషన్ లేకపోవడంతో కంటెస్టెంట్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సోమవారం నాడు అంతా దీని గురించే చర్చించుకున్నారు. ఇక సోమవారం ఎప్పటిలాగే నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ వారం నామినేషన్స్ లో వెరైటీగా ఒక గుహలో ఏర్పాటు చేశారు. ఆ గుహలో ఒక సింహం బొమ్మ పెట్టారు. సింహం ఆకలిమీద ఉంది, మీరు ఎవర్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ బొమ్మ ఉన్న చికెన్ ముక్క సింహం నోట్లో వేయాలని బిగ్ బాస్ చెప్పాడు.

నామినేషన్స్ లో మొదట అమర్ దీప్ వచ్చి ఎవిక్షన్ పాస్ లో తప్పుడు గేమ్ ఆడినందుకు యావర్ ని నామినేట్ చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అవ్వగా కావాలంటే నువ్వు కూడా నన్ను నామినేట్ చేసుకో అని అమర్ అన్నాడు. ఆ తర్వాత రతికని నామినేట్ చేశాడు. ఇక గౌతమ్ వచ్చి ప్రశాంత్, శివాజీలను నామినేట్ చేశాడు. దీంతో ప్రశాంత్ – గౌతమ్ మధ్య గొడవ జరగగా ప్రశాంత్.. గౌతమ్ కట్టుకొచ్చిన పంచె జారిపోద్ది జాగ్రత్త అంటూ మాట్లాడటంతో గౌతమ్ సీరియస్ అయి ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు. దీంతో ప్రశాంత్ సారీ చెప్పాడు.

అనంతరం రతిక.. అమర్ దీప్ ని, ప్రశాంత్ ని నామినేట్ చేసింది. అమర్ రతిక ఎలిమినేషన్ ని చాలా సిల్లీగా తీసుకున్నాడు. ఆ తర్వాత అర్జున్.. యావర్ తప్పుడు గేమ్ ని ప్రస్తావిస్తూ నామినేట్ చేశాడు. అలాగే శివాజీని కూడా నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్.. గౌతమ్, రతికలను నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విని మాత్రం సిల్లీ కారణాలతో ఎవర్ని నామినేట్ చేయదలుచుకోవట్లేదని చెప్పడంతో బిగ్ బాస్ అయితే సెల్ఫ్ నామినేట్ అవుతావు అని చెప్పడంతో సరే అని తనకు తానే సెల్ఫ్ నామినేషన్ అయింది అశ్విని. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఆశ్చర్యపోయారు.

Also Read : Bigg Boss 7 Day 77 : ఎలిమినేషన్స్ విషయంలో నాగ్ నిర్ణయం.. ఈ వారం ఇలా.. వచ్చేవారం అలా..

ఇక మిగిలిన నామినేషన్స్ నేటి ఎపిసోడ్ లో ఉండనున్నాయి. ఈ వారం ఎలాగూ డబల్ ఎలిమినేషన్ ఉండటంతో అశ్విని ఎలిమినేట్ అయిపోతుందని ఊహించుకొని సెల్ఫ్ నామినేషన్ చేసుకుందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇక మిగిలిన ప్రియాంక, శోభాశెట్టి, శివాజీ, యావర్.. ఎవర్ని నామినేట్ చేస్తారో.. మొత్తంగా ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉంటారో చూడాలి.