టాలీవుడ్ స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా లు పెళ్లి చేసుకున్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ఈ జంట పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరు ఒక్కటి అయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినీ పరిశ్రమ నుంచి ఎవరిని పిలవకుండా ఇంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి ? ఇది నిజంగానే ఒరిజినల్ ఫొటోయేనా? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే.. పెళ్లిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా వీరిది ప్రేమ వివాహంగా తెలుస్తోంది.
Suresh Sangaiah : సినీ పరిశ్రమలో విషాదం.. యువ దర్శకుడు సురేశ్ సంగమయ్య కన్నుమూత
ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచాడు అనురాగ్ కులకర్ణి. ఆ తరనువాత సినిమాల్లో వరుసగా సాంగ్స్ పాడుతున్నారు. కేరాఫ్ కంచరపాలెంలోని ‘ఆశా పాశం’, ఆర్ఎక్స్ 100లో ‘పిల్ల రా’ వంటి పాటలతో అభిమానులను సొంతం చేసుకున్నాడు.
అటు రమ్య బెహరా విషయానికి వస్తే.. సూపర్ సింగర్ 4లో పాల్గొంది. టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, కొత్తజంట, చిన్నదాన నీకోసం, ఇస్మార్ట్ శంకర్, రెడ్, రంగ్ దే సినిమాల్లో రమ్య పాడిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది.