Suresh Sangaiah : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. యువ ద‌ర్శ‌కుడు సురేశ్‌ సంగ‌మ‌య్య క‌న్నుమూత‌

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది

Suresh Sangaiah : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. యువ ద‌ర్శ‌కుడు సురేశ్‌ సంగ‌మ‌య్య క‌న్నుమూత‌

Oru Kidayin Karunai Manu director Suresh Sangaiah passes away

Updated On : November 16, 2024 / 9:32 AM IST

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. యువ ద‌ర్శ‌కుడు సురేశ్‌ సంగ‌మ‌య్య క‌న్నుమూశాడు. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న కాలేయ సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం రాత్రి 10.20 సమ‌యంలో తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్నేహితుడు, సినిమాటోగ్రాఫర్ శరణ్ ధృవీకరించారు.

సురేశ్‌ సంగ‌మ‌య్య మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. ఆయ‌నకు భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

తమన్ మాటలతో ఫీల్ అయిన దేవి శ్రీ ప్రసాద్?

2017లో ‘ఒరు కిడైయిన్ కరు మను’ చిత్రంతో దర్శకుడిగా మారాడు సురేష్. ఈ మూవీలో విధార్థ్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ర‌వీనా ర‌వి క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ఇక గతేడాది ‘సత్య సోతనై’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాకుండా కమెడియన్ యోగిబాబుతో కూడా OTT సినిమా తెరకెక్కించాడు.