తమన్ మాటలతో ఫీల్ అయిన దేవి శ్రీ ప్రసాద్?
పుష్ప 2 రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Gossip Garage is Devi Sri Prasad hurt by Thaman comments
Gossip Garage : పుష్ప 2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఫస్ట్ హాఫ్ ఎప్పుడో లాక్ చేసేశారు. సెకండాఫ్ ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఐతే పుష్ప 2మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నుంచి దేవిశ్రీప్రసాద్‌ను తప్పించారని తమన్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనిపై తమన్ క్లారిటీ ఇవ్వగా ఆయన మాటలతో దేవీ ఫీల్ అయ్యాడట. ఇంతకీ తమన్ ఏం చెప్పాడు. DSP ఎందుకు ఫీల్ అయ్యాడు.
టాలీవుడ్‌లోనే కాదు పుష్ప 2 మీద ఉత్తరాదిలోనూ భారీ క్రేజ్ ఉంది. ఈ ఇయర్ మోస్ట్ అవేయిటెడ్ మూవీస్‌లో టాప్‌లో ఉందీ సినిమా. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కాబోతుండగా విడుదల తేదీ దగ్గరవుతున్నా కొద్దీ సినిమాకు సంబంధించి రకరకాల గాసిప్‌లు వైరల్ అవుతున్నాయ్. పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీ ప్రసాద్‌ని మార్చారనే రూమర్.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనుకున్న టైమ్‌కు మూవీని రిలీజ్ చేయాలని ఓ వైపు షూటింగ్, మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్.. వేగంగా చేయిస్తున్నాడు సుకుమార్.
Kanguva collections : సూర్య ‘కంగువా’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
పుష్ప రెండు పార్ట్‌లకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఐతే సినిమా త్వరగా కంప్లీట్ కావాలంటే.. స్పీడ్ పెంచాలని భావించిన డైరెక్టర్ సుకుమార్.. కొందమంది మ్యూజిక్ డైరెక్టర్లతో రీరికార్డింగ్ చేయిస్తున్నాడు. ఇందులో తమన్ కూడా ఒకడు. ఐతే మ్యూజిక్ ఎవరు చేస్తున్నారన్న దానిపై.. మూవీ యూనిట్ నుంచి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. ఐతే డాకూ మహారాజ్ మూవీ టీజర్ లాంచ్‌లో తమన్ ఇచ్చిన క్లారిటీ.. దేవీ శ్రీ ప్రసాద్ ఫీల్ అయ్యేలా చేసిందట.
పుష్ప2కు తాను కొంత వర్క్ చేశానని తమన్.. ఆ ఈవెంట్‌లో చెప్పాడు. దీనిపై DSP ఫీల్ అయినట్లు టాక్. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ నచ్చకపోవడంతోనే.. థమన్‌తో పుష్ప 2కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయించారని.. ప్రచారం జరుగుతోంది. ఇది దేవీకి ఇబ్బందిగా మారిందట. తమన్ మాటలతో ఆయన బాగా బాధపడ్డారట. మూవీ టీమ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇదంతా ఎలాఉన్నా.. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రెండున్నర నిమిషాల వీడియోలో పుష్పరాజ్ అరాచకం శాంపిల్ చూస్తారని తెలుస్తోంది. మూవీ మీద ట్రైలర్ మరి అంచనాలు పెంచడం ఖాయమని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
https://youtu.be/VihnOK8e_Ec?si=GsCS-nHKqgU_EBGB