TollyWood : నీట్ ఫైట్.. తెలుగు హీరోల మద్దతు ఏది.?
టాలీవుడ్ హీరోలకు (TollyWood ) విద్యార్థుల ఉద్యమం కనిపించట్లేదా అంటూ.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అటాక్ట్ స్టార్ట్ చేశారు
Tollywood Stars Silent Over NEET Protests
TollyWood : నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్‌లో స్టూడెంట్స్ చేస్తున్న ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్టూడెంట్స్ ఫైట్‌కు రాజకీయ పార్టీలతో పాటు సినీ ఇండస్ట్రీల నుంచి కూడా పలువురు మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు స్టూడెంట్స్‌కు సంఘీభావం తెలుపుతూ సోషల్ మీడియాలో స్పందించడం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే టాలీవుడ్ ప్రముఖుల సపోర్ట్ ఏదంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క పెద్ద హీరో కూడా రియాక్ట్ కాకపోవడంపై..సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు.
Chennai Love Story day 1 collection : చెన్నై లవ్ స్టోరీ తొలి రోజు కలెక్షన్ ఎంతంటే ?
టాలీవుడ్ హీరోలకు విద్యార్థుల ఉద్యమం కనిపించట్లేదా అంటూ.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అటాక్ట్ స్టార్ట్ చేశారు. అభిమానులు, ముఖ్యంగా స్టూడెంట్స్, తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. మీ సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్లు ఎంత పెంచినా మేము చూడాలి కానీ..స్టూడెంట్స్‌గా హక్కుల కోసం పోరాడుతుంటే కనీసం ఓ ట్వీట్ కూడా చేయలేరా.? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోలు స్పందించినప్పుడు, టాలీవుడ్ సెలబ్రిటీల మౌనం ఎందుకు అంటున్నారు. దీంతో టాలీవుడ్ టార్గెట్ అవుతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా విద్యార్థుల ఆందోళనపై తెలుగు సినీ ప్రముఖులు స్పందిస్తారా.? లేక ఇదే మౌనం కొనసాగిస్తారా.? అనేది వేచి చూడాలి.
