Radhe Shyam : వీక్ అంతా ఊపు ఊగిపోద్దిగా..

వచ్చే వారంలో క్రేజీ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్ ఖుష్ అవడం, సోషల్ మీడియా షేకవడం కన్ఫమ్..

Radhe Shyam : వీక్ అంతా ఊపు ఊగిపోద్దిగా..

Updates

Updated On : November 21, 2021 / 7:27 PM IST

Radhe Shyam: పాండమిక్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం వచ్చింది. తిరిగి షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మెల్లగా థియేటర్లు తెరుచుకున్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో ఆడియన్స్ హాళ్లకు వస్తున్నారు. మేకర్స్ కూడా భారీ స్థాయిలో రిలీజెస్ ప్లాన్ చేస్తున్నారు.

Akhanda : సెన్సార్ టాక్.. ‘సింహ’ గర్జన సాలిడ్‌గా ఉంటుందంట..

డిసెంబర్, జనవరిలో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘పుష్ఫ’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్నాయి. ఇప్పటివరకు పోస్టర్స్ అండ్ వీడియోస్ అండ్ పాటలతో సందడి చేసిన క్రేజీ సినిమాలకు సంబంధించి వచ్చే వారంలో అదిరిపోయే అప్‌డేట్స్ రాబోతున్నాయి.

Radhe Shyam : రెండు డిఫరెంట్ కట్స్‌లో ‘రాధే శ్యామ్’..

‘ఆర్ఆర్ఆర్’ థర్డ్ సింగిల్, ‘రాధే శ్యామ్’ సెకండ్ సింగిల్, ‘అఖండ’ నుండి మూడో పాటతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే వారంలోనే రానున్నాయి. ఈ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్ ఖుష్ అవడం, సోషల్ మీడియా షేకవడం కన్ఫమ్ అని కొత్తగా చెప్పక్కర్లేదు కదా..

RRR Movie : రాజమౌళి సినిమాకి సల్మాన్ సపోర్ట్..